close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 21/02/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆ 600యాప్‌ల తొలగింపు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనుచిత ప్రకటనలతో వినియోగదారులకు చికాకు తెప్పిస్తున్న దాదాపు 600 యాప్‌లను గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ప్రకటనల విషయంలో సదరు యాప్‌లు తమ విధానాలను ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను వినియోగిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, డివైజ్‌ పనితీరును దెబ్బతీసేలా, అనుకోని రీతిలో తెరపై ప్రకటనలను ఇస్తున్న యాప్‌లను తొలగిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఇప్పటికే దాదాపు 4.5 బిలియన్ల సార్లు ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం. యాప్‌ని వినియోగించని సమయంలో, కాల్‌ చేస్తున్న సమయంలో కూడా ఇవి స్క్రీన్‌పై ప్రకటనల్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల వినియోగదారుల విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీటిని యాప్‌ నుంచి తీసేశామన్నారు. 

ఇప్పటికే సదరు యాప్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చిన కంపెనీలకు లేదా ఉత్పత్తులకు నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. కేవలం డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా సృష్టించిన ఇలాంటి మోసపూరిత యాప్‌లు చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, భారత్‌ కేంద్రంగానే పనిచేస్తున్నాయని గూగుల్‌ ఆరోపించింది. ఇంగ్లిష్‌ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకొని వీటిని రూపొందిస్తున్నారని అభిప్రాయపడింది. ఏదైనా యాప్‌ను తొలగించేముందు దాని నిర్వాహకులకు తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తూ ముందుగానే నోటీసులు ఇస్తుందని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. తొలగించిన వాటిలో చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘చీతా మొబైల్‌’ యాప్ ఉన్నట్లు సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.