6 నగరాలు.. 6 బృందాలు
close

తాజా వార్తలు

Published : 11/06/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

6 నగరాలు.. 6 బృందాలు

కొవిడ్‌-19పై సమీక్షకు కేంద్ర బృందాల నియామకం

దిల్లీ: దేశంలోని మెట్రో నగరాల్లో కరోనా కట్టడి చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరు కేంద్ర బృందాలను ఏర్పాటు చేసింది. ముంబయి, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు నగరాల్లో ఈ బృందాలు పర్యటిస్తాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కొవిడ్‌-19 కేసులు సంఖ్య 277,458కి చేరుకుంది. ముంబయి (51,100), అహ్మదాబాద్‌ (14,962), చెన్నై (24,545), కోల్‌కతా (3,018), దిల్లీ (31,309), బెంగళూరు (558) నగరాల్లో కొన్ని రోజులుగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నగరాల్లో వైరస్‌ను కట్టడికి పటిష్ఠ చర్యలు తీసుకొనేందుకు కేంద్రం బృందాలను ఏర్పాటు చేసింది.

‘ఈ నగరాల్లో జన సాంద్రత చాలా ఎక్కువ. లాక్‌డౌన్‌ విధించాక ఈ నగరాల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడం సవాల్‌గా నిలిచింది. ఎందుకంటే అక్కడ జనాల కదలికలు ఎక్కువగా ఉన్నాయి’ అని కొవిడ్‌-19పై కేంద్ర సత్వర స్పందనా బృందంలోని సభ్యుడు డాక్టర్‌ జుగల్‌ కిషోర్‌ అన్నారు. ‘నగరాల్లో అసలు పరిస్థితి తెలుసుకోవాలని మేం భావిస్తున్నాం. ముంబయి, దిల్లీ పరిస్థితి సంక్లిష్టంగా ఉంది. కేసుల నమోదు, మరణాలు, పరీక్షల నిష్పత్తి, అందుబాటులో పడకలు, పీపీఈల నిల్వను సమీక్షించనున్నాం. గతంలోనూ నిపుణులు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పర్యటించి సలహాలు ఇచ్చారు’ అని ఆయన తెలిపారు.

మరో వారం రోజుల్లో కేంద్ర బృందాలు నగరాల్లో పర్యటిస్తాయని డాక్టర్‌ జుగల్‌ కిషోర్‌ అన్నారు. ఐసీఎంఆర్‌ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ల్యాబ్స్‌ సంఖ్య 590, ప్రైవేటు ల్యాబ్స్‌ సంఖ్య 233కు పెంచారన్నారు. ఇప్పటి వరకు ఐసీఎంఆర్‌ 50,61,332 టెస్టులు చేసింది. గత 24 గంటల్లోనే 1,45,216 నమూనాలను పరీక్షించడం గమనార్హం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని