నేను ట్రంప్‌ని కాదు..ఉద్ధవ్‌ వీడియో వైరల్‌ 
close

తాజా వార్తలు

Updated : 06/08/2020 12:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను ట్రంప్‌ని కాదు..ఉద్ధవ్‌ వీడియో వైరల్‌ 

ప్రజలు బాధపడుతుంటే చూడలేనన్న సీఎం 

ముంబయి: ‘నేనేమీ ట్రంప్‌ని కాదు. నా కళ్ల ముందే ప్రజలు బాధపడుతుంటే చూడలేను’’ అంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మాటలు శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా కోసం ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనివి. ఈ వారాంతంలో రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన టీజర్‌ను ‘అన్‌లాక్‌ ఇంటర్వ్యూ’ పేరుతో సంజయ్‌  తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాపైనే ఉంది. కరోనా వైరస్‌పై వ్యవహరించిన తీరుతో పాటు మహమ్మారి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారనే తీవ్ర విమర్శల్ని ట్రంప్‌ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఏ సందర్భాన్ని ఉద్దేశించి చేశారనే విషయం తెలియడం లేదు. పూర్తి ఇంటర్వ్యూ వచ్చాకే ఆ విషయం తెలుస్తుంది. ముంబయి వీధుల్లో వడాపావ్‌ ఎప్పుడు దొరుకుతుందంటూ సంజయ్‌ రౌత్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉద్ధవ్‌ స్పందించారు.  అలాగే, లాక్‌డౌన్‌ ఇంకా ఉందనీ.. క్రమంగా మినహాయింపులు ఇస్తూ ఒక్కొక్కటిగా తెరుస్తున్నట్టు ఉద్ధవ్‌ చెప్పుకొచ్చారు.

మన దేశంలో అయితే, కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 8336 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,27,031 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 1,82,217 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 12,276 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,32,236 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 55.72% ఉండగా.. మరణాల రేటు 3.75 %గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని