
తాజా వార్తలు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
సిడ్నీ: మరికాసేపట్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మూడో టీ20 ఆడనున్నాయి. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఆ జట్టును వైట్‌వాష్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియా దీనిలో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఇదే చివరిది అయినందున.. టెస్టు సిరీస్‌లోకి అడుగుపెట్టేముందు కచ్చితంగా విజయంతో వెళ్లాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తిగా మారింది.
భారత జట్టు: శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, నటరాజన్, యుజవేంద్ర చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), మాథ్యూవేడ్, స్టీవ్‌స్మిత్, మాక్స్వెల్, డీ ఆర్కీ షార్ట్, హెన్రిక్స్, డానియల్ సామ్స్, సీన్ అబాట్, మిచెల్ స్వెప్సన్, ఆండ్రూ టై, ఆడం జంపా