close

తాజా వార్తలు

Published : 21/07/2020 02:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్లినికల్‌ ట్రయల్స్‌ బృంద సభ్యునితో ముఖాముఖి

హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నిరోధానికి దేశీయంగా చేస్తున్న ప్రయత్నాల్లో గణనీయమైన మరో ముందడుగు పడింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌ నిరోధక వ్యాక్సిన్‌ అయిన ‘కోవ్యాక్సిన్‌’ క్లినికల్‌ ట్రయల్స్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో నేడు మొదలయ్యాయి. ఆరోగ్యవంతులైన ఇద్దరు వాలెంటీర్లకు వైద్యులు తొలివిడత వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను నిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, క్లినికల్‌ ట్రయల్స్‌ బృందం సభ్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించారు. 
ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ... క్లినికల్‌ ట్రయల్స్‌ను పూర్తి ఆరోగ్యవంతులపై మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఉదయం 11 గంటలకు ఒకరికి, అనంతరం 30 నిముషాల మరొకరికి వ్యాక్సిన్‌ను ఇచ్చామన్నారు. కాగా, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని, సైడ్‌ ఎఫెక్ట్‌ ఏవీ కనిపించలేదని వైద్యులు వివరించారు. భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌తో నిమ్స్‌ ఆస్పత్రిలోని వివిధ వైద్య విభాగాలు సంఘటితంగా కృషిచేశామని... ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యేదాకా ఈ ప్రక్రియ కొనసాగిస్తామని శ్రీనివాస్‌ వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశవ్యాప్తంగా 370 మంది ఎంపిక కాగా...  60 మందికి ఈ ప్రక్రియను నిమ్స్‌లో నిర్వహిస్తామన్నారు. జంతువులపై ప్రయోగాలు చేసే ప్రిక్లినికల్‌ దశ కాగా... తదనంతరం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనుషులపై నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌లో నాలుగు దశలు ఉంటాయని ఆయన వివరించారు. ముఖాముఖి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడవచ్చు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన