దసరా కానుక: కారు కొనిచ్చిన బ్యూటీ
close

తాజా వార్తలు

Published : 28/10/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దసరా కానుక: కారు కొనిచ్చిన బ్యూటీ

ముంబయి: బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తన వద్ద పనిచేస్తున్న ఓ వ్యక్తికి కారు బహుమతిగా ఇచ్చారు. దసరా సందర్భంగా ఈ ప్రత్యేకమైన కానుకతో అతడిని సర్‌ప్రైజ్‌ చేశారు. కారు తాళాలు చేతికిచ్చి.. స్వయంగా పూజ కూడా చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. నటి మంచితనాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. జాక్వెలిన్‌ కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఆ వ్యక్తి ఆమెతో కలిసి పనిచేస్తున్నాడట. దీంతో ఆయనపై అభిమాన్ని ఆమె ఈ రూపంలో చూపించారు. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు కారు డెలివరీ కావడంతో అదే దుస్తుల్లో జాక్వెలిన్‌ పూజ చేశారు. గతంలోనూ ఆమె తన మేకప్‌ ఆర్టిస్టుకు కారు బహుమతిగా ఇచ్చి.. మనసులు దోచుకున్నారు.

2019లో ‘సాహో’ చిత్రంలో సందడి చేసిన జాక్వెలిన్‌.. ఆపై ‘డ్రైవ్‌’, ‘Mrs. సీరియల్‌ కిల్లర్‌’తో అలరించారు. మరోపక్క జాన్‌ అబ్రహంతో కలిసి ‘ఎటాక్‌’, సైఫ్‌ అలీ ఖాన్‌తో కలిసి ‘భూత్‌ పోలీస్‌’, సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ‘కిక్‌ 2’, రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ సినిమాల్లో నటిస్తున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని