
తాజా వార్తలు
ఎ-గ్రేడ్ నాయిక ఎలా అవ్వాలంటే..
తాప్సీకి దీటుగా బదులిచ్చిన కంగనా టీం
ఇంటర్నెట్ డెస్క్: కథానాయికలు కంగనా రనౌత్-తాప్సిల మధ్య కొద్దిరోజులుగా ట్విటర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాప్సి బి-గ్రేడ్ నటి అంటూ ఓ ఇంటర్వ్యూలో కంగనా చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆ వ్యాఖ్యలపై స్పందించిన తాప్సి కంగనాకు చురకలంటించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను తాను ఎ-జాబితా నాయికగా పరిగణించుకోలేదని, మరి కంగనా ఎలా అయిందో తనకు తెలియదని పేర్కొంది.
తాప్సి చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా టీం బదులిచ్చింది. ఎ-గ్రేడ్ నాయికగా మారాలంటే ఏం చేయాలో తెలిపింది. ‘‘మంచి నటన. బలమైన వ్యక్తిత్వం. వీటన్నింటికి మించి క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక లాంటి నాయికా ప్రాధాన్యమున్న హిట్ చిత్రాలు. ఇవేవీ కాకపొయినా ఓ సోలో హిట్ చిత్రం నిన్ను ఎ-గ్రేడ్ నాయికను చేస్తుంది. గో తాప్సి’ అంటూ కంగనా టీం ట్విటర్లో దీటుగా సమాధానమిచ్చారు. తాప్సి ఇంటర్వ్యూ స్క్రీన్షాట్లను కూడా అందులో ఉంచారు.