close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ ఆరోపణలన్నీ అవాస్తవం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి హైదరాబాద్‌- రంగారెడ్డి జిల్లా నేతలతో భాజపా జన్‌సంవాద్‌ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనాతో రాజధాని హైదరాబాద్‌ ఎప్పుడు పేలుతుందో తెలియదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌ కేంద్రంపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. రాష్ట్రానికి 6లక్షల మాస్క్‌లు, 2లక్షల పీపీఈ కిట్లు, మందులు ఇచ్చామన్నారు. గ్రామ పంచాయతీలు, ఉద్యోగులు, విపత్తు నిర్వహణకు నిధులు ఇచ్చామని తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో టెస్టులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని కిషన్‌ రెడ్డి విమర్శించారు.  

చైనా కుట్రలను ఎదుర్కొంటాం..
చైనా కుట్రలను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. అన్ని రంగాల్లో భారత్‌ ఆత్మనిర్భర భారత్‌తో దేశాన్ని కాపాడుకోగలిగే సత్తా ఉందన్నారు. డిఫెన్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై విమర్శలు చేస్తున్న వామపక్ష పార్టీలు అవగాహన పెంచుకొని మాట్లాడాలని సూచించారు. విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చిన శిక్షణ, నైపుణ్యత, సిబ్బంది అంతా భారత్‌ నుంచే ఉంటారన్నారు. 

లాక్‌డౌన్‌పై పూర్తిస్వేచ్ఛ ఇచ్చాం

 ముంబయి, ధారవి వంటి ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోందన్న మంత్రి.. మురికావాడల్లో కరోనాను జయించేందుకు సంసిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

కాశ్మీర్ సమస్యతోనే భారతీయ జన్ సంఘ్ ప్రారంభమైందని తెలిపారు. ఆర్టికల్‌ 370పై లేనిపోని అపోహలు సృష్టించారన్నారు. రక్తపు బొట్టు చిందకుండా కశ్మీర్‌ ప్రజల అభిమానాన్ని ప్రధానిమోదీ చూరగొన్నారన్నారు. పాకిస్థాన్‌లో అనేకమంది హిందువులు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోతుందోని చెప్పారు. 


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని