close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 18/05/2020 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కఠినం-సులభం: మదింపు చేశాకే నిర్ణయం

లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు నీరుగార్చొద్దన్న కేంద్రం

దిల్లీ: దేశవ్యాప్తంగా మే 31వరకు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాల అమలును నీరుగార్చొద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. జోన్ల వారీగా ఆంక్షల అమల్లో రాజీ పడొద్దని వెల్లడించింది. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు.

‘గత లేఖల్లో నొక్కిచెప్పినట్టుగానే, కేంద్ర హోమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నీరుగార్చొద్దు. పరిస్థితులను మదింపు చేసి వేర్వేరు జోన్లలో అవసరమైతే ఆంక్షలను కఠినతరం లేదా సులభతరం చేయాలి. తాజా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నా’ అని అజయ్‌భల్లా ప్రస్తావించారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నాకే రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను రాష్ట్రాలే వర్గీకరించేందుకు నూతన మార్గదర్శకాలు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. వ్యక్తుల కదలికలను నియంత్రించాలని వెల్లడించారు. వైద్యం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు, సేవల కోసం తప్ప జోన్లు దాటి ఎవరినీ బయటకు రానీయొద్దని తెలిపారు. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో కొన్నింటికి అస్సలు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.