close

తాజా వార్తలు

Updated : 24/11/2020 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రైవేటు టీచర్ల సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై కసరత్తు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘‘ఇంటరాక్షన్‌ విత్‌ కేటీఆర్‌’’ పేరిట హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో కేజీ టు పీజీ ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు, కళాశాలల యాజమాన్యాలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో తమకు అవకాశం ఇస్తే ప్రతిరోజూ తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే దృష్టి సారించామని.. తప్పకుండా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు లక్షలకుపైగా ప్రైవేటు ఉపాధ్యాయులున్నారని.. వారికి ఏ విధంగా సాయం అందించాలనే విషయంపై చర్చిస్తున్నట్లు వివరించారు. 2014 నుంచి ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఎదర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా యాజమాన్యాలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కాస్త సమయం ఇవ్వాలని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేటీఆర్‌ వివరించారు.

సినిమా థియేటర్లే కాదు విద్యా సంస్థలు సైతం తెరిచి రోడ్డునపడ్డ తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ ఓ ప్రైవేటు టీచర్‌ చేసిన విజ్ఞప్తిపై కేటీఆర్ స్పందించారు. ‘‘కొవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలు తెరిచే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేనూ ఒక తండ్రినే.‌ ప్రస్తుత పరిస్థితుల్లో నా పిల్లలను కూడా పాఠశాలకు‌ పంపాలంటే ఆలోచిస్తాను. ఈ విషయంలో తల్లిదండ్రులు అందరూ అదే విధంగా ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరిస్తే సుమారు 600 మంది ఉపాధ్యాయులు, కొంత మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్పి ఉంటుంది’’ అని కేటీఆర్‌ వివరించారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని