close
Array ( ) 1

తాజా వార్తలు

ఫిట్‌గా ఉన్నా.. నన్ను బలవంతంగాతొలగించారు

అఫ్గాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌

కాబుల్‌: తనకే సమస్యా లేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నా అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు ప్రపంచకప్‌ నుంచి తనని బలవంతంగా తొలగించారని ఆ దేశ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షెజాద్‌ వాపోయాడు. అయితే అతనికి మోకాలికి గాయమైందని పేర్కొంటూ ఆయన స్థానంలో ఇక్రమ్‌ అలీ ఖిల్‌ను అఫ్గాన్‌ జట్టులో అనుమతిస్తూ ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షెజాద్‌ తనకు అన్యాయం జరిగిందని వాపోయినట్లు ఇబ్రహీమ్‌ మోమండ్‌ అనే ఓ రిపోర్టర్‌ ట్వీట్‌ చేశాడు. 

ఇదిలా ఉండగా అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గానూ అతడికి మంచి పేరుంది. ఇప్పటివరకూ 84 వన్డేలాడిన అతను 33.66 సగటుతో 2727 పరుగులు చేశాడు. అందులో 14 అర్ధశతకాలు సాధించగా నాలుగు శతకాలు ఉన్నాయి. అయితే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ తొలి సన్నాహక మ్యాచ్‌లో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుతిరిగాడు. తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వార్మప్‌ మ్యాచ్‌లో ఆడాడు. అనంతరం  లీగ్‌ దశలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డేల్లోనూ కొనసాగాడు. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ పరుగులకే ఔటయ్యాడు. 

ఈ క్రమంలో మూడో మ్యాచ్‌కు ముందు షెజాద్‌ గాయం కారణంగా అతడిని తప్పిస్తూ ఇక్రమ్‌ అలీ ఖిల్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. అయితే తనని తొలగించే ముందు అఫ్గాన్‌ బోర్డు అధికారులు ఒక్క మాట కూడా చెప్పలేదని షేజాద్‌ తన సందేశంలో పేర్కొన్నాడు. కాగా షెజాద్‌ ప్రపంచకప్‌ నుంచి తొలగించడంతో స్వదేశానికి చేరుకున్నాడు. అతడికి అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.