తెలంగాణలో 154 కేసులు.. 14 మృతులు
close

తాజా వార్తలు

Updated : 07/06/2020 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 154 కేసులు.. 14 మృతులు

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 14 మంది బాధితులు కరోనా మహమ్మారికి బలవగా.. ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 137కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా మరో 154 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,650కి చేరింది.

నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 132 కేసులు నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా బారిన పడినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 1,742 మంది బాధితులు ఇళ్లకు వెళ్లిపోగా.. 1,771 మంది చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకినవారిలో 3,202 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మరో 448 మంది వలస కార్మికులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిగా గుర్తించినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని