close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120046829 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => osgttYAbeFE [video_short_link] => osgttYAbeFE [created_by] => [created_date] => [modified_by] => 9030386 [modified_date] => 2020-04-07 23:11:24.004374 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

అత్యవసరమనీ.. నిత్యావసరాలనీ.. 

కుంటి సాకులతో రోడ్లపైకి వస్తోన్న వాహనదారులు 
మహానగరంలో పెరుగుతోన్న వాహనాల సంఖ్య

హైదరాబాద్‌: ఓ వైపు లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా.. రాష్ట్రంలో 50 శాతం కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నా.. నగరంలో వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నిబంధనలను ఉల్లఘించి రహదారులపై రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు వీరికి జరిమానాలు విధించి వాహనాలనూ స్వాధీనం చేసుకున్నా.. కుంటి సాకులు చెబుతూ ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. దీంతో రహదారులపై కొంత వరకు రద్దీ పెరగడంతో కొన్ని కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిగ్రల్స్‌ను ఏర్పాటు చేశారు. 
నిబంధనల సడలింపు.. నిరుపయోగం 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అత్యవసర, నిత్యావసరాల కోసం కొంత వరకు నిబంధనలను సడలింపు చేయడంతో వాటిని వివిధ రకాలుగా నిరుపయోగం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి  7 గంటల వరకూ లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర పనులుంటే వారి నివాస స్థలం నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణం చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులుంటే పోలీసులు అనుమతి పత్రాలు మంజూరు చేస్తున్నారు. కానీ వాహనదారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి రహదారులపై వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 6వ తేదీన ఒక్క రోజే దాదాపు 15 వేల వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వాటిలో 13 వేలకుపైగా ద్విచక్రవాహనాలే ఉండడం గమనార్హం. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో ప్రజలు సహకరించి ఈ మహమ్మారి నివారణకు చేయూత అందించాలని పోలీసులు కోరుతున్నారు. 

 

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.