కప్పు గెలిచిన  కీ‘రన్‌’ వచ్చేశాడు!
close

తాజా వార్తలు

Published : 13/09/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కప్పు గెలిచిన  కీ‘రన్‌’ వచ్చేశాడు!

అబుదాబి: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ముగియడంతో అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఐపీఎల్‌ జట్లలో చేరుతున్నారు. స్టార్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ శనివారం ముంబయి ఇండియన్స్‌తో కలిశాడు. అతడితో పాటు షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ సైతం జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ముంబయి ట్వీట్‌ చేసింది.

ఈ నెల 10న కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ జరిగింది. సెయింట్‌ లూసియా జౌక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. విజయగర్వంతో ఆ జట్టు సారథి కీరన్‌ పొలార్డ్‌ అబుదాబికి చేరుకోవడం గమనార్హం.

‘పొలార్డ్‌ కుటుంబం, రూథర్‌ఫర్డ్‌ కరీబియన్‌ దీవుల నుంచి అబుదాబికి చేరుకొని ముంబయి ఇండియన్స్‌ కుటుంబంతో కలిశారు’ అని ముంబయి తెలిపింది. రాయల్‌ ఛాలెంజర్స్‌కు మినహా మిగతా అన్ని జట్లలో సీఎప్‌ఎల్‌ ఆటగాళ్లు ఉన్నారు. 

డ్వేన్‌ బ్రావో, మిచెల్‌ శాంట్నర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, క్రిస్‌లిన్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌, ఆండ్రూ రసెల్‌, హెట్‌మైయిర్‌, సందీప్‌ లామిచాన్‌, కీమో పాల్‌, కాట్రెల్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, నికోలస్‌ పూరన్‌, ఓషాన్‌ థామస్‌ లీగ్‌లో రాణించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని