close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 20/04/2020 17:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా కేసుల రెట్టింపులో ఊరట

సగటున 7.5 రోజులకోసారి డబుల్‌
మెరుగైన స్థితిలో ఏపీ, తెలంగాణ

దిల్లీ: కరోనా మహమ్మారి రెట్టింపు అవడానికి పడుతున్న వేగం భారత్‌లో నెమ్మదించింది. లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకోసారి కేసుల రెట్టింపు కాగా.. ప్రస్తుతం అది 7.5 రోజులకు చేరిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఈ మహమ్మారి భయపెడుతున్న వేళ కేసుల రెట్టింపు వేగం తగ్గుమఖం పట్టడం ఊరటనిచ్చే విషయం కావడం గమనార్హం. జాతీయ సగటుతో పోల్చినప్పుడు తెలుగు రాష్ట్రాలు మిన్నగా ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 36 మరణాలు సంభవించాయని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,546 మంది కోలుకున్నారని, మొత్తం కేసుల్లో ఇది 14.75 శాతమని చెప్పారు. ఈ మేరకు సంయుక్త మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

దేశంలో కరోనా రెట్టింపు వేగం తగ్గుముఖం పడుతోందని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కేరళ, కర్ణాటకలో ఈ రెట్టింపు వేగం బాగా తగ్గిందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెట్టింపు రేటు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా  ఉండడం గమనార్హం. జాతీయ స్థాయిలో 7.5 రోజులకు రెట్టింపు అవుతుండగా ఏపీలో 10.6 రోజులకు, తెలంగాణలో 9.4  రోజులకు డబుల్‌ అవుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఈ రేటు 8.5 రోజులుగా ఉందని చెప్పారు. ఒడిశాలో ఈ రేటు 39.8 రోజులుగా ఉండగా.. కేరళలో 72.2 రోజులుగా ఉందని పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోల్చినప్పుడు మొత్తం 18 రాష్ట్రాలు ఈ విషయంలో మెరుగ్గా ఉన్నాయన్నారు.

గోవా కొవిడ్‌-19 ఫ్రీ
పుదుచ్చేరిలోని మహి, కర్ణాటకలోని కొడగు, ఉత్తరాఖండ్‌లోని పౌడి గఢ్వాల్‌ జిల్లాల్లో గత 28 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాని జిల్లాలు దేశంలో 59 ఉన్నాయన్నారు. గోవాలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు లేవని, ప్రస్తుతం ఆ రాష్ట్రం కొవిడ్‌-19 ఫ్రీ అని తెలిపారు. ఆ రాష్ట్రంలో ఏడుగురు కరోనా బారిన పడగా అందరూ కోలుకోవడం గమనార్హం.

ఇవీ చదవండి..

కిట్లు ఆర్డర్‌ ఇచ్చినపుడే షరతు పెట్టాం: జగన్‌

అమెరికా: 15 పేజీలు శ్రద్ధాంజలి ప్రకటనలే


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.