close
Array ( ) 1

తాజా వార్తలు

ఎక్కడెవరో తేలింది

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
అతివలకు 6 కార్పొరేషన్లు.. 61 మున్సిపాలిటీలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో రాష్ట్ర పురపాలకశాఖ ప్రకటించింది. నగర పాలక సంస్థల్లో ఎస్టీలకు 8 శాతం, ఎస్సీలకు 8 శాతం, బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. పురపాలక సంఘాల్లో ఎస్టీలకు 3 శాతం, ఎస్సీలకు 14 శాతం, బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కాయి. మహిళలకు ఆరు కార్పొరేషన్‌లు, 61 పురపాలక సంఘాలు రిజర్వు అయ్యాయి.

రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలతో పాటు ప్రస్తుతం ఎన్నికలు లేని 3 పురపాలక సంఘాలు, 3 నగర పాలక సంస్థలకు కూడా రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో తాజా రిజర్వేషన్లు అమలవ్వనున్నాయి. ప్రస్తుతం ఖరారు చేసిన రిజర్వేషన్లు రెండు ఎన్నికల వరకు అమలులో ఉంటాయి. రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని పురపాలకశాఖ ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో పురపాలకశాఖ డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి ఖరారు చేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల గెజిట్‌లను ప్రచురించి జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్లకు.. జహీరాబాద్‌, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను ఇప్పుడే వెల్లడించారు. జనరల్‌ కేటగిరిలో 62 పురపాలక సంఘాలు ఉండగా వీటిలో 31 మహిళలకు రిజర్వయ్యాయి. రాష్ట్రంలో పురపాలక సంఘాల్లోని 2727 వార్డులు, నగర పాలక సంస్థల్లోని 385 డివిజన్లకు రిజర్వేషన్లను శనివారం ప్రకటించారు. తాజాగా రిజర్వుడ్‌ స్థానాలను ప్రకటించి ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను పురపాలకశాఖ ముగించింది.

 


మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఇలా...

రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్‌ పదవులకు పురపాలకశాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. వివరాలిలా ఉన్నాయి.
*  ఎస్టీ జనరల్‌: ఆమన్‌గల్‌, డోర్నకల్‌
*  ఎస్టీ మహిళ: మరిపెడ, వర్ధన్నపేట
*  ఎస్సీ జనరల్‌: క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, అయిజ, నస్పూర్‌, నేరేడుచర్ల, తొర్రూరు, నార్సింగి
*  ఎస్సీ మహిళ: మధిర, పరకాల, పెబ్బేరు, అలంపూర్‌, వడ్డేపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి
*  బీసీ జనరల్‌: నారాయణ్‌ఖేడ్‌, అందోలు, జోగిపేట, గద్వాల, నిర్మల్‌, రాయికల్‌, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్‌, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్‌, కొడంగల్‌, ఖానాపూర్‌, తూప్రాన్‌, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్‌
*  బీసీ మహిళ: సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, భీమ్‌గల్‌, ఆర్మూరు, కోస్గి, మెట్‌పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్‌, పోచంపల్లి, సుల్తానాబాద్‌, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్‌, యాదగిరిగుట్ట, బోధన్‌
*  జనరల్‌ మహిళ: చొప్పదండి, పెద్దపల్లి, వేములవాడ, కొత్తగూడ, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్‌, జనగామ, నాగర్‌కర్నూల్‌, శంషాబాద్‌, హుస్నాబాద్‌, మంథని, హుజూర్‌నగర్‌, హుజూరాబాద్‌, శంకర్‌పల్లి, వికారాబాద్‌, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌, నందికొండ, తెల్లాపూర్‌, కోదాడ, తుర్కయాంజాల్‌, గుండ్ల పోచంపల్లి
*  అన్‌రిజర్వుడు: హాలియా, మెదక్‌, దేవరకొండ, గజ్వేల్‌, జహీరాబాద్‌, కొత్తపల్లి, ఇల్లెందు, అచ్చంపేట, భూత్పూరు, లక్షెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్‌, నల్గొండ, కల్వకుర్తి, షాద్‌నగర్‌, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిభట్ల, చిట్యాల, ఆదిలాబాద్‌, అమీన్‌పూర్‌, మహబూబాబాద్‌, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తూంకుంట, బొల్లారం, మణికొండ, జల్‌పల్లి.


పారదర్శకంగా రిజర్వు సీట్ల ఎంపిక

రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల మహిళలకు కేటాయించే స్థానాలను లాటరీ ద్వారా ఎంపికచేశారు. ఆదివారం పురపాలక డైరెక్టర్‌ టి.కె.శ్రీదేవి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ నేతలే లాటరీ తీశారు. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను నిర్ణయించినట్లు సీడీఎంఏ తెలిపారు. రాష్ట్రం యూనిట్‌గా కోర్టు వివాదాలు లేని 123 పురపాలక సంఘాలు, 13 నగర పాలక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించామన్నారు. విలీన పంచాయతీల గడువున్న పురపాలక సంఘాలైన నకిరేకల్‌, జడ్చర్ల, ఏజెన్సీ ప్రాంతంలోని పాల్వంచ, మణుగూరు, మందమర్రికి ఎన్నికలు జరగడం లేదని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.