close

తాజా వార్తలు

Published : 23/09/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాన్న.. ఆస్పత్రి నుంచి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారు!

చెన్నై: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. ఎక్మో/వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వైద్యులు తన తండ్రికి ఫిజియో థెరపీ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన