పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

తాజా వార్తలు

Updated : 24/07/2020 12:14 IST

పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట

రాజస్థాన్‌: రాజస్థాన్‌ రాజకీయాలు గంట గంటకూ మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. అనర్హత పిటిషన్లపై యథాతథస్థితి కొనసాగించాలని రాజస్థాన్‌ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రాజస్థాన్‌ స్పీకర్‌ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ .. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉండగా.. ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించిన రాజస్థాన్‌ హైకోర్టు .. విచారణను 15 నిమిషాల పాటు వాయిదా వేసింది. అనంతరం విచారణ కొనసాగించిన హైకోర్టు .. ఈ కేసు విచారణలో కేంద్రాన్ని కూడా చేర్చడంతో తుది తీర్పు ఆలస్యమయ్యే అవకాశముందని, అప్పటి వరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

 సచిన్‌ పైలట్‌ వర్గీయుల తిరుగుబాటు నేపథ్యంలో కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌ స్పీకర్‌ 19 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు ఇచ్చే వరకు తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోరాదని హైకోర్టు స్పీకర్‌కు సూచించింది. ఈ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని రాజస్థాన్‌ శాసనసభ స్పీకర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్పీకర్‌ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని