
తాజా వార్తలు
లఘు చిత్ర ‘సిరి’
ఇంటర్నెట్ డెస్క్ : రంగం ఏదైనా సరే.. కృషి, పట్టుదల ఉంటే చాలు. వాటితో ప్రతిభను మెరుగు పరుచుకొంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నిజాయితీగా ప్రయత్నిస్తే ఎంచుకున్న రంగంలో పూలబాటలు వేసుకోవచ్చు. చేసే పనిపై దృష్టి పెడితే అనుకున్న విజయం సొంతం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని నిరూపిస్తోంది అనంతపురం యువతి. లఘుచిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెనే సిరి సిరిఖన్కన్. సినిమా రంగానికి చెందిన వారు ఎవరూ లేకున్నా, అభిరుచి అనే ఏకైక ఆయుధంతో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి లఘు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చదువులో రాణిస్తూనే నటిగా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
పాఠశాల దశలోనే నటనలో తొలి అడుగులు వేస్తూ, అనేక సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిందామె. బాలనటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో నాట్యంలో తర్ఫీదు పొందింది. నటిగా, నాట్యకారిణిగా అనేక వేదికలపై మెరిసింది. వెన్నంటి ప్రోత్సహించిన తల్లి ఆశల్ని నిజం చేస్తూ అనేక అవార్డులను సొంతం చేసుకుంది.
ఇంటర్ వరకూ అనంతపురంలోనే చదివిన సిరి ఉన్నత చదువుల కోసం బెంగళూరుకు వెళ్లింది. అక్కడే లఘు చిత్రాలలో నటించే అవకాశాలు ఆమెను పలకరించాయి. నాట్యం, నటనలో పట్టున్న సిరి తక్కువ సమయంలోనే లఘు చిత్రాల్లో తనదైన ముద్రవేసింది. రెండేళ్లలోనే 25కు పైగా లఘుచిత్రాల్లో నటించి నెటిజన్ల అభిమానం దక్కించుకుంది. కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా ప్రతిభకు ఆస్కారం ఉన్న అన్ని రకాల రోల్స్ చేస్తూ మెరిసింది. ‘ఓ మధులో’ కళాశాల యువతిగా, ‘1947 ఆగస్టు 14’ అనే లఘు చిత్రంలో నిండు గర్భిణీగా చక్కని నటనతో ఆకట్టుకుంది. ఆమె ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు మోడలింగ్‌లో అవకాశాలు ఇచ్చాయి. అలా కొన్ని ప్రకటనల్లోనూ నటించిందామె. గత ఏడాది..బెంగళూరులో ఫేమ్ ఇండియా నిర్వహించిన అందాల పోటీలో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది సిరి.
సిరిఖన్కన్ అసలు పేరు శిరీష. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఆదరణ దక్కించుకోవాలనే తపనతో పేరు మార్చుకుంది. ఆమె తాతయ్య రంగస్థల కళాకారుడు. ఆయన స్ఫూర్తితోనే నటన పైపు అడుగులు వేసిందామె. అవరోధాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగింది. ఆమెకు సౌందర్య అంటే ఎంతో ఇష్టం. నటిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న సిరి చదువును ఏమాత్రం అశ్రద్ధ చేయటంలేదు. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసి అత్యధిక మార్కులతో కళాశాల టాపర్‌గా నిలిచింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
