close

తాజా వార్తలు

కొనసాగుతున్న టీడీఎల్పీ సమావేశం

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానమే ప్రధాన అజెండాగా ఈ భేటీలో చర్చిస్తున్నారు. సభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ రాజధాని తరలింపును ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై వ్యూహరచన చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఏ రూపంలో బిల్లు తెస్తుంది.. ఆ సమయంలో ఎలాంటి వ్యూహం అవలంబించాలి తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని సభ్యులందరికీ ఇప్పటికే పార్టీ విప్‌ జారీచేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.