close

తాజా వార్తలు

Published : 11/08/2020 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. భారత్‌లో 45వేలు దాటిన కరోనా మరణాలు!

భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో రోజువారీ మరణాల సంఖ్య వెయ్యికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24గంటల్లో మరో 871 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 45,257కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్‌లో గత నాలుగురోజులుగా వరుసగా 60వేల కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. కానీ, నిన్న ఈ సంఖ్య 53వేలకు పడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 10రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ!

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై మోదీ సమీక్ష చేస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అందరికీ పరీక్షలు చేస్తున్నాం: ప్రధానితో జగన్‌

3. చికిత్స వరకే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి

రోజు రోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున ఎక్కువ మందికి వైద్యం అందించి త్వరితగతిన కోలుకునేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనుమతితో స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ‘‘జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతోనే బందరు రోడ్డులోని ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితులకు కేటాయించాం. అందులో 30 పడకలు మాత్రమే ఉండటంతో ఎక్కువ మందిని అక్కడ చేర్చుకోలేక పోయాం. కరోనా బాధితులకు వైద్యం అందించాలని ఒత్తిడి, అభ్యర్థనలు రావడం వల్ల అన్ని సౌకర్యాలు ఉన్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ తీసుకున్నాం’’ అని రమేష్ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్య వన్నెతెచ్చారు’

తన పదవీ కాలంలో మూడో ఏడాది కీలకమని, ఆ సమయంలో కీలక బిల్లులకు ఆమోదం లభించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, పౌర సవరణ చట్టం వంటి బిల్లులు ఆమోదం పొందాయన్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి ‘కనెక్టింగ్‌, కమ్యూనికేటింగ్‌, ఛేంజింగ్‌’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. జిత్తులమారి డ్రాగన్‌..!

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంటుంది చైనా తీరు.. ఓ పక్క సరిహద్దుల్లో శాంతి కోరుకుంటున్నామని చెబుతూనే మరోపక్క భారీగా ఆయుధాలను తరలిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు వద్ద తిష్ఠవేసిన చైనా సేనలు ఆ ప్రదేశం తమదే అంటూ వాస్తవాధీన రేఖనే మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సైనికుల ఉపసంహరణ.. ఉద్రిక్తతలు చల్లార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నా.. సరిహద్దుల్లో మాత్రం అవేవీ కనిపించడంలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఆకాశ గంగ’ను చూస్తారా...

భారతీయ వాయుసేన, తన సిబ్బంది ధైర్య సాహసాలకు ప్రతీక అనదగిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విడుదల చేసింది. ‘‘ఎగురుతున్న విమానంలో నుంచి బయటకు దూకితే నువ్వు పిచ్చివాడివైనా అయి ఉండాలి... లేదా స్కైడైవర్‌ అయి ఉండాలి! ఆకాశంలో మబ్బులను వెంటాడుతున్న, పక్షులతో పోటీపడుతున్న భారతీయ వాయుసేనకు చెందిన ‘ఆకాశ గంగ’ స్కై డైవింగ్‌ టీమ్‌ను కలుసుకోండి.’’ అనే వ్యాఖ్యానాన్ని కూడా జతచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రత్యామ్నాయశక్తిగా ఎదగాలి: రాంమాధవ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఎదగాలని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు మంగళవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాంమాధవ్‌ మాట్లాడుతూ.. ఐడియాలజీతో పాటు సంస్ధాగతమైన వ్యవస్థతో ముందుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అసలైన ‘కార్గిల్‌ గర్ల్’‌ సాహసం తెలుసా?

దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో‌ నటించిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా- ది కార్గిల్‌ గర్ల్’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలవ్వగానే అందరిలోనూ ఒకటే ఆసక్తి. ఎవరీ గుంజన్‌ సక్సేనా? దేశం కోసం ఆమె ఏం చేసింది? భారత వాయుసేనలో ఎందుకు చేరింది? ఎలాంటి కష్టాలు అనుభవించింది? కార్గిల్‌ యుద్ధక్షేత్రంలోకి ఎందుకు అడుగు పెట్టింది? చావు భయాన్ని ఎదురించి ఆమె సైనికులను ఎలా రక్షించింది? శౌర్యచక్ర పురస్కారం అందుకున్న ఆమె ఇప్పుడేం చేస్తోందో తెలుసుకోవాలని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ కథనం! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌లోనే సచిన్‌ పైలట్‌!

రాజస్థాన్‌లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ వేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన  సోనియా, రాహుల్‌, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు’ అని సచిన్‌ పైలట్‌ ట్విటర్‌లో ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 800వ వికెట్‌ ఎలా తీశానంటే..!

అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తొలుత పేస్‌ బౌలర్‌ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు మారమని సలహా ఇచ్చాడని ఆయన చెప్పారు. మొదట ఆఫ్‌స్పిన్‌ మాత్రమే వేశానని తర్వాత అన్ని అస్త్రాలు నేర్చుకున్నానని తెలిపారు. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘డీఆర్‌ఎస్‌ విత్‌ అశ్విన్‌’ షోలో ఆయన తమిళంలో సంభాషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.