close

తాజా వార్తలు

Updated : 12/10/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. నిజామాబాద్‌లో కవిత ఘనవిజయం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో తెరాస విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823 ఓట్లకు గానూ తెరాస 728 ఓట్లు కైవసం చేసుకోగా.. భాజపా 56, కాంగ్రెస్‌ 29 ఓట్లు దక్కించుకుంది. 10 చెల్లని ఓట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటిరౌండ్‌లోనే కవితకు భారీ ఆధిక్యం దక్కింది. తొలి రౌండ్లో తెరాసకు 531, భాజపాకు 39, కాంగ్రెస్‌కు 22 ఓట్లు వచ్చాయి. ఏడు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 71,559 రికవరీలు.. 66,732 కేసులు

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 71,20,539కి చేరింది. గత 24 గంటల్లో 9,94,851 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిలో 66,732 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో 8,61,853 మందికి చికిత్స కొనసాగుతుండగా.. 61,49,536 కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 816 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,09,150కి పెరిగింది. నిన్న ఒక్కరోజే 71,559 మంది బాధితులు కోలుకోవడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వైరస్‌పై నేరుగా దాడి.. మంచి ఫలితాలు!

3. కోస్తాఆంధ్ర వైపు దూసుకొస్తున్న వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు రాబోయే 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్ర తీరానికి సమీపంలోకి వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్టణానికి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కి.మీటర్లు, నర్సాపూర్‌కు తూర్పు ఆగ్నేయ దిశగా 360కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమరావతిని చంపేందుకు కుట్ర:లోకేశ్‌

అమరావతిని చంపేందుకు ప్రభుత్వం,  వైకాపా నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని తెదేపా జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రైతుల ఉద్యమం 300 రోజుకు చేరిన సందర్భంగా పెనుమాకలో ఎంపీ గల్లా జయ్‌దేవ్‌, తెదేపా నేతలతో కలిసి ఆయన రైతులు, మహిళలకు సంఘీభావం తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని ఉధ్యమాన్ని కించపరిచేలా మంత్రులు, వైకాపా నేతలు ఇష్టానుసారం మాట్లాడినా రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారని లోకేశ్‌ అన్నారు. 90 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సుధీర్‌కి నవదీప్ కౌంటర్‌‌..!

‘గల్లీలో సిక్స్ ఎవరైనా కొడతారు.. స్టేడియంలో సిక్స్‌ కొట్టేవాడికే ఒక రేంజ్‌ ఉంటుంది’ అంటూ సుధీర్‌పై కౌంటర్‌ వేస్తున్నారు నటుడు నవదీప్‌. అంతేకాకుండా ‘దమ్ముంటే నన్నాపు’ అంటూ సుధీర్‌కి ఛాలెంజ్‌ కూడా చేశారు. రష్మి, వర్షిణిల కోసమే వీరిద్దరూ ఇంతలా కౌంటర్లు వేసుకుంటున్నారు. విజయదశమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఈటీవీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ప్రేక్షకులను అలరించడానికి.. ప్రతి ఒక్కరి ఇంట్లో పండగ వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈటీవీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘అక్కా ఎవరే అతగాడు?’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్‌కు ఖుష్బూ గుడ్‌బై

ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమెను అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తూ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఆమె భాజపాలో చేరుతున్నట్లు ఆదివారం ఉదయం నుంచి భారీ స్థాయిలో ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయాన్ని చెన్నైకి చెందిన భాజపా నాయకుడు కూడా నిర్ధరించినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. నేడు దిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్తంభించిన ముంబయి!

దేశ వాణిజ్య రాజధాని ముంబయి స్తంభించిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో పారిశ్రామిక కార్యకలాపాలు సహా రైళ్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఆస్పత్రుల కోసం అత్యవసరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఉదయం పది గంటల తర్వాత క్రమంగా ఒక్కో ప్రాంతంలో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. ముంబయి, ఠాణే సహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో విద్యుత్‌ ఆగిపోవడం ఇదే తొలిసారని పలువురు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వయసులో చిన్నదయినా.. పెద్ద సాయం చేస్తోంది!

ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమైన తర్వాత వివిధ పత్రికల్లో వచ్చిన హెడ్‌లైన్స్‌ ఇవీ. ఆన్‌‌లైన్‌ తరగతుల ద్వారా పాఠాల బోధన ఆలోచన బాగానే ఉన్నా.. ఆ పాఠాలు వినడానికి పేద విద్యార్థులు నోచుకోవట్లేదు. ఈ-తరగతులు వినాలంటే స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌ తప్పనిసరి. అవి కొనాలంటే వేల రూపాయలు వెచ్చించాలి. కూలి పనులు చేసుకునేవారు, అల్పాదాయ వర్గాలు వీటిని కొని పిల్లలను చదివించే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు తరగతులకు హాజరు కాలేమనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సంగీత దర్శకుడు రాజన్‌ కన్నుమూత..!

ప్రముఖ సంగీత దర్శకులు రాజన్‌-నాగేంద్ర సంగీతాభిమానులకు చిరపరిచితులు. వారిలో ఒకరైన రాజన్‌ (87) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాజన్‌ మృతిచెందారని ఆయన కుమారుడు అనంత్‌కుమార్‌, ఇతర కుటుంబసభ్యులు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు రాజన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ధర ఎక్కువ.. దూకుడు తక్కువ

ఈసారి టీ20 క్రికెట్‌ లీగ్‌లో అభిమానుల అరుపుల్లేవ్‌.. అయినా మెరుపులకు కొదవలేదు. ఒకరోజు బ్యాట్స్‌మెన్‌ విధ్వంసం సృష్టిస్తే.. అదేగడ్డపై మరునాడు బౌలర్లు మ్యాచ్‌ను శాసిస్తున్నారు. టీ20 అంటే బౌండరీల మోత. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరైనా.. ఏ క్షణంలోనైనా.. ఎటువంటి బంతినైనా స్టాండ్స్‌లోకి తరలించిన వాళ్లే ఇక్కడ హీరోలు. మరి హీరోలు అని భావించిన జీరోలుగా మారుతున్నారు. వాళ్లందరూ గతంలో బంతుల్ని కేకలు పెట్టించిన హిట్టర్లే. మ్యాచ్‌లను మలుపు తిప్పిన మ్యాచ్‌ విన్నర్లు. అయితే వాళ్లందరికీ ఇప్పుడేమైంది..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఓడినా ఓ ‘సెంచరీ’ నమోదు చేసిన దిల్లీ! 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.