close

తాజా వార్తలు

Published : 28/11/2020 08:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. నేడు ప్రధాని రాక

కొవిడ్‌-19 కోరల నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలక పర్యటనలు చేపట్టనున్నారు. భారత్‌లో కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న భారత్‌ బయోటెక్‌, సీరం, జైడస్‌ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన ఒకేరోజు పుణె, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌లలో పర్యటించనున్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ప్రచారంలో కాక

2. అక్రమ నిర్బంధమే

రాజధాని ప్రాంతంలో రైతులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపడం అక్రమ నిర్బంధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సెక్షన్‌ 41ఎ ప్రకారం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి, జైలులో ఉంచడం అక్రమ నిర్బంధమేనని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని పేర్కొంది. దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మళ్లీ వాయుగుండం!

 తీరం దాటిన తుపాను బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో అండమాన్‌ దీవుల వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10 జిల్లాలపై నివార్‌

4. ఇక వాహనాలకూ నామినీ సౌకర్యం

కేంద్ర రహదారి, రవాణాశాఖ వాహనాల విషయంలో శుక్రవారం ఒకే రోజు మూడు సంస్కరణలను ప్రతిపాదించింది. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, బీమాలకు ఉన్న నామినీ సౌకర్యాన్ని ఇప్పుడు వాహనాలకూ వర్తింపజేస్తూ కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టింది. పురాతనమైన వింటేజ్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌కు నూతన నిబంధనలను తెర మీదికి తెచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

5. చైనా కంట్లో తైవాన్‌ నలుసు!

చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతోపాటు పది ‘ఆసియాన్‌’ దేశాలతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్దదైన స్వేచ్ఛా వాణిజ్య మండలం (రీజినల్‌ కాంప్రహెన్సివ్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ (ఆర్‌సీఈపీ-ఆర్‌సెప్‌) ఏర్పాటు అయ్యింది. ఆర్‌సెప్‌లో సభ్యదేశం కాని తైవాన్‌- అమెరికాతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. దీనికి ఇప్పటికే అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులు, నాయకులు మద్దతు ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. సగం ధరకే కొవిడ్‌ పరీక్ష

 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) సులభతరం చేసింది. వైరస్‌ నిర్ధారణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ‘డ్రైస్వాబ్‌’ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) శుక్రవారం అనుమతి ఇచ్చిందని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా తెలిపారు.హైదరాబాద్‌లోని కేంద్ర పరిశోధన సంస్థ సీసీఎంబీ ఏప్రిల్‌ నుంచి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

రష్యా టీకా.. హెటిరో తయారీ

7. నేను మైనస్‌ డిగ్రీల్లో ప్రేమ ప్లస్‌ అవుతుందా?

రక్తం గడ్డ కట్టే చలిలోనూ.. ఆమె ఆలోచనలతో నాకు చెమటలు పడుతున్నాయి. నా పేరు రమేష్‌. ఇండియన్‌ ఆర్మీలో సైనికుడిని. మాది విజయనగరం. ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో విధులు నిర్వహిసున్నా. మైనస్‌ 30 డిగ్రీల చలిలో డ్యూటీ. చుట్టూ చిమ్మ చీకటి. ఎముకలు కొరికే చలి. అనుక్షణం నా కళ్లు శత్రువుల అలికిడిని కనిపెడుతూనే ఉన్నా మనసు మాత్రం నా బంగారం జ్ఞాపకాల చుట్టూ తిరుగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. పంచాయతీ ఎన్నికలు 14 రోజుల్లోనే పూర్తి

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఇకపై ప్రకటన(నోటిఫికేషన్‌) వెలువడిన నాటి నుంచి 14 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ చట్టానికి ఇప్పటికే సవరణలు చేశారు. సంబంధిత బిల్లును ఈనెల 30 నుంచి నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2013లో పంచాయతీ ఎన్నికలను 21 రోజులపాటు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ‘మేజర్‌’.. అన్నయ్యలా అనిపించారు  

‘‘ముంబయిలో 26 /11 దాడులు జరిగినప్పుడు నేను అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్నా. అక్కడి న్యూస్‌ ఛానల్స్‌లో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ ఫొటో చూసినప్పుడు మాఇంట్లో నా అన్నయ్యలా అనిపించారు. దాంతో ఆయనెవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. 2008 నుంచీ నా మనసులోనే ఉన్న ఆయన గురించి పదేళ్లపాటు సమాచారాన్ని సేకరించా’’ అన్నారు అడవి శేష్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. పేలవారంభం

కరోనా విరామం తర్వాత టీమ్‌ఇండియా అంతర్జాతీయ క్రికెట్‌ను ఓటమితో మొదలెట్టింది. స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించలేకపోయిన కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించింది. తొలి వన్డేలో కంగారూలకు తలవంచింది. ఛేదనలో హార్దిక్‌, ధావన్‌ పోరాటం మినహాయిస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో భారత్‌ తేలిపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ప్రేక్షకుల సమక్షంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్మిత్‌, ఫించ్‌ శతకాలతో చెలరేగగా.. హేజిల్‌వుడ్‌, జంపా బౌలింగ్‌లో అదరగొట్టి జట్టును గెలిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని