close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120053652 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => bKpk5Hb5_w4 [video_short_link] => bKpk5Hb5_w4 [created_by] => [created_date] => [modified_by] => 963258741 [modified_date] => 2020-04-22 13:04:42.862511 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

‘ప్రమాణానికి సిద్ధం..సరే తేదీ నేను నిర్ణయిస్తా’

విజయసాయిరెడ్డి, కన్నా మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణల మధ్య గత కొద్దిరోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. నేతలిద్దరూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నాపై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసన్నారు. దానికి కన్నా సైతం దీటుగా కౌంటర్‌ ఇచ్చారు. పచ్చకామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ విజయసాయిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెదేపా అధినేత చంద్రబాబు దగ్గర రూ.20కోట్లు తీసుకున్నారంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని.. దీనిపై కాణిపాకం వినాయకుడి దగ్గర ప్రమాణం చేసేందుకూ సిద్ధమని విజయసాయి వ్యాఖ్యానించడం.. దానికి తేదీ, సమయం చెబుతా.. సిద్ధంగా ఉండాలంటూ కన్నా ప్రకటించడం చర్చనీయాంశమయ్యాయి. నిజంగానే నేతలిద్దరూ ‘కాణిపాకం’ ప్రమాణానికి వెళతారా? లేదా? అన్నది కాలమే నిర్ణయించనుంది.

అసలేం జరిగింది..

కరోనా ర్యాపిడ్‌ కిట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని.. మంత్రులు, అధికారులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీలో కమిషన్‌ కొట్టేశారా? అంటూ ట్విటర్‌లో ఆయన వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.337కే ఒక్కో కిట్‌ కొనుగోలు చేసిందని.. ఏపీలో మాత్రం ధర విషయంలో ఒక్కో రకంగా చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రూ.630 అని చెప్పారని.. పర్చేజ్‌ ఆర్డర్‌లో రూ.730గా అని ఉందని గుర్తు చేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి కన్నాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుకు కన్నా అమ్ముడుపోయారంటూ వ్యాఖ్యానించారు. విజయసాయి వ్యాఖ్యలపై కన్నా దీటుగా బదులిచ్చారు. చంద్రబాబు నన్ను కొన్నారని తప్పుడు మాటలు మాట్లాడుతారా?నన్ను కొనే వారు పుట్టలేదు అని చెప్పారు. ఈ విషయంలో కాణిపాకం వినాయకుడి సన్నిధిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా? అని విజయసాయిరెడ్డికి కన్నా సవాల్‌ విసిరారు. 

ఆ తర్వాత కన్నా సవాల్‌పై విజయసాయి స్పందించారు. 2019 ఎన్నికల సమయంలో భాజపా అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో కన్నా, పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? ఏయే నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారనే వివరాలు లెక్కలతో సహా తన వద్ద ఉన్నట్లు చెప్పారు. రూ.20కోట్లకు కన్నా అమ్ముడుపోయారనే వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని.. దానిపై కన్నా చెప్పినట్లుగా కాణిపాకం వినాయకుడి వద్ద సాష్టాంగ ప్రమాణానికైనా సిద్ధమని ప్రకటించారు. అనంతరం కన్నా సైతం మీడియా ముందుకు వచ్చి విజయసాయి వ్యాఖ్యలను ఖండించారు. ప్రమాణానికి ఆయన అంగీకరించినట్లు భావిస్తున్నానని.. లాక్‌డౌన్‌ తర్వాత తేదీ, సమయం చెబుతానన్నారు. ప్రమాణానికి సిద్ధం కావాలని విజయసాయికి కన్నా సూచించారు. 

ఇవీ చదవండి..

కన్నాపై మళ్లీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు

విజయసాయి వ్యాఖ్యలపై కన్నా కౌంటర్‌

నన్ను కొనేవాళ్లు పుట్టలేదు 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.