Oxygen కోసం బైక్‌ ఇచ్చేస్తోన్న నటుడు
close

తాజా వార్తలు

Published : 03/05/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Oxygen కోసం బైక్‌ ఇచ్చేస్తోన్న నటుడు

ఇంటర్నెట్‌ డెస్క్: కొవిడ్‌ బాధితుల్ని ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు సినీ తారలు ముందుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ సేవాగుణాన్ని చాటుతున్నారు. తాజాగా యువ నటుడు హర్షవర్ధన్‌ రాణే.. కరోనాతో పోరాటం చేస్తోన్న వారికి తనవంతు సాయం చేయాలని భావించారు. ఇందుకు తన ద్విచక్ర వాహనాన్ని (రాయల్‌ ఎన్‌ఫీల్డ్) ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారాయన. ‘కొన్ని ఆక్సిజన్‌ సిలిండర్లు తీసుకునేందుకు నా బైక్‌ని ఇవ్వాలనుకుంటున్నాను (ఎక్స్ఛేంజ్‌ రూపంలో). అవసరమైన వారికి వాటిని అందజేద్దాం. దయచేసి హైదరాబాద్‌లో మంచి ఆక్సిజన్‌ సిలిండర్లు ఎక్కడ లభిస్తాయో చెప్పండి’ అని కోరారు.

 ‘తకిట తకిట’ సినిమాతో నటుడిగా కెరీర్‌ ప్రారంభించారు హర్ష. ‘నా ఇష్టం’, ‘అవును’, ‘అనామిక’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’, ‘ఫిదా’, ‘కవచం’ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు. ‘సనమ్‌ తేరీ కసమ్‌’తో కథానాయకుడిగా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ప్రస్తుతం ‘తార వర్సెస్‌ బిలాల్‌’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని