భోజన ప్రియుల కోసం.. ఓ విమానం!
close

తాజా వార్తలు

Published : 14/04/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భోజన ప్రియుల కోసం.. ఓ విమానం!

భువనేశ్వర్: నచ్చిన ఆహారాన్ని తెప్పించుకోవడం.. తినేసి, బిల్లు కట్టి రావడం.. అన్ని రెస్టారెంట్ల పద్ధతి ఇదే. వీటన్నింటిని దాటుకొని వినియోగదారులను ఆకట్టుకునే ఆలోచనతో ముందుకు వచ్చింది క్వీన్ ఎయిర్‌వేస్ రెస్టారెంట్. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్ జాతీయ రహదారి పక్కన హన్స్‌పాల్ స్క్వేర్ సమీపంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది. అంతేకాక సెల్ఫీ స్పాట్‌గానూ మారిపోయింది. 

విమానాన్ని దగ్గరగా చూస్తోన్న ఫీలింగ్‌.. ఎయిర్‌ హోస్టెస్‌తో స్వాగతం.. విమానంలో కూర్చొని, నచ్చిన రుచులను ఆస్వాదిస్తోన్న అనుభవం.. ఇది తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ రెస్టారెంట్ స్టైల్ అంటున్నారు యజమాని స్మృతి రంజన్ మోహంతి. ఒడిశా రుచులతో పాటు.. కేరళ, పంజాబ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, రాజస్థాన్‌, గోవా, తెలంగాణ వంటకాలను ఇక్కడ హాయిగా ఆరగించొచ్చు. ఓకేసారి 20 మందికి ఆతిథ్యం ఇస్తుంది. శాకాహార, మాంసాహార వంటకాలన్నీ అందుబాటు ధరల్లోనే లభ్యమవుతాయని చెప్తున్నారు అక్కడి సిబ్బంది. ఇక ముందుగానే బుకింగ్ చేసుకొని పుట్టిన రోజు వేడుకలు, కిట్టీ పార్టీ, ఇతర చిన్న చిన్న సంబరాలను అంబరంలో జరుపుకున్నట్లు ఎంజాయ్ చేయొచ్చు. తృప్తిగా భోజనం చేసిన తరవాత.. కొత్త రెస్టారెంట్‌ను తమ సెల్ఫీల్లో బంధించి, వినియోగదారులు సంతోష పడుతున్నారని మోహంతి తెలిపారు. కోరుకున్న రుచులను అందించడం, పరిశుభ్రతే తమ మొదటి ప్రాధాన్యమని వెల్లడించారు. ఇప్పుడీ రెస్టారెంట్ స్థానికులను తెగ ఆకట్టుకుంటోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని