close

తాజా వార్తలు

Updated : 29/11/2020 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్‌ షా పూజలు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన కొనసాగుతోంది. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షాకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పరిపూర్ణానంద స్వామి, పలువురు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం  చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమిత్‌ షాతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తదితరులు ఉన్నారు. 

అమిత్‌ షా రాక నేపథ్యంలో చార్మినార్‌ ప్రాంతం కాషాయమయమైంది. భారీగా తరలి వచ్చిన భాజపా శ్రేణులు జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అమిత్‌ షా వారాసిగూడ చేరుకున్నారు. అక్కడి చౌరస్తా నుంచి హనుమాన్‌ టెంపుల్‌ సీతాఫల్‌మండీ వరకు రోడ్‌షోలో పాల్గొన్నారు. భాజపా, జనసేన కార్యకర్తుల రోడ్‌షోలో భారీగా పాల్గొన్నారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన