
తాజా వార్తలు
భారత్‌లో యూకే స్ట్రెయిన్ కేసులు @29
దిల్లీ: దేశంలో యూకే స్ట్రెయిన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో నాలుగు కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తంగా కొత్త కరోనా కేసుల సంఖ్య 29కి పెరిగింది. దేశంలో కొవిడ్ -19 వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్న జనానికి.. కొత్తగా నమోదవుతున్న యూకే స్ట్రెయిన్ కేసుల పెరుగుదల మరింత కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 10 ల్యాబ్‌లకు గాను ఆరు ల్యాబ్‌లలో పరీక్షల వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన ఈ నాలుగు కేసుల్లో మూడు బెంగళూరులో కాగా.. ఒకటి హైదరాబాద్‌లో వచ్చినట్టు సమాచారం. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు నమోదైన స్ట్రెయిన్ కేసులు ఇవీ..
బ్రిటన్‌లో స్ట్రెయిన్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన భారత్.. ఆ దేశం నుంచి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య 33వేల మంది వచ్చినట్టు గుర్తించింది. వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా.. కొందరిలో కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. మంగళ, బుధవారాల్లో 20 మందిలో స్ట్రెయిన్ ఉన్నట్టు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు.. గురువారం మరో ఐదుగురిని గుర్తించారు. తాజాగా మరో నలుగురిలో కొత్త రకం కరోనా (స్ట్రెయిన్) ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 29కి పెరిగింది.
ఇదీ చదవండి..
కొవిడ్ టీకా: ఎన్నిరోజులకు ఇమ్యూనిటీ వస్తుందంటే..!
వ్యాక్సిన్... అలా మొదలైంది..!