
తాజా వార్తలు
ఏపీలో కొత్తగా 545 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 47,130 నమూనాలను పరీక్షించగా 545 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా 10 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 6,948కి పెరిగింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురం,తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,390 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జికాగా.. రాష్ట్రంలో 13394 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,62,220 నమూనాలను పరీక్షించినట్లు బులిటెన్‌లో పేర్కొంది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు