తొలగించాలన్న చేతిని.. అతికించారు
close

తాజా వార్తలు

Updated : 07/02/2021 08:15 IST

తొలగించాలన్న చేతిని.. అతికించారు

కాకినాడ (మసీదు సెంటర్‌), న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు యంత్రంలో ఇరుక్కుని ఓ యువకుడి చేయి నుజ్జునుజ్జు కాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు 5గంటల పాటు శస్త్రచికిత్స చేసి ఆ చేతిని అతికించి విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల సోనా కురానీ రాజానగరం మండలంలోని ఓ పీచు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శుక్రవారం అతడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. అతడిని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చేతిని తొలగించాలని, అందుకు రూ.8 లక్షలవుతుందని  వైద్యులు తెలిపారు. దీంతో అతడిని హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 2వ యూనిట్‌ చీఫ్‌ డా.బీఎస్‌ఎస్‌ వెంకటేశ్వర్లు బృందం శుక్రవారం రాత్రి 11.40నుంచి తెల్లవారుజామున 4.30 వరకు శస్త్రచికిత్సలు చేసి చేతిని అతికించారు. గాయపడినచోట చర్మమంతా పాడవడంతో తొడలోని కండను తీసి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారు. అరుదైన ఘనత సాధించిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.మహాలక్ష్మి అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని