close

తాజా వార్తలు

జనసేనతో కలిసి పోరాడతాం: కన్నా

అమరావతి: వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరు ప్రశాంతంగా ఉన్నారో సీఎం జగన్‌ చెప్పాలి. ప్రతి పిచ్చి పనికి కేంద్రం సహకారం ఉందని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఎన్నికలకు ముందు మూడు రాజధానులు చేస్తామని వైకాపా చెప్పలేదు. రాజధాని మార్చేందుకు వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరు. ఖర్చు ఒక్కటే కారణమని నేను అనుకోవట్లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల తరఫున జనసేనతో కలిసి పోరాటం చేస్తాం’’ అని కన్నా తెలిపారు.

కుటుంబ వ్యవహారం కాదు : జీవీఎల్‌
ఎంపీ జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ ఒక్కటే ఉంటే రాజధాని అని ఎవరూ అనరు. మూడు రాజధానులు ఒక మిథ్య మాత్రమే.  వైకాపా ప్రభుత్వం స్వార్థప్రయోజనాలకే ఎక్కువ ప్రాధన్యమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించడానికి ఇది కుటుంబ వ్యవహారం కాదు. పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్రంపై రుద్దే ప్రయత్నం మంచిది కాదు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తే .. తెలుగుదేశం పార్టీ దద్దమ్మ పాత్ర పోషిస్తుందా? ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటున్నారు.. చర్యలు తీసుకోవట్లేదు. వైకాపా ప్రభుత్వం అక్రమార్కులను కాపాడే ప్రయత్నం చేస్తుందా? అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెబుతూ.. విచారణకు ఎందుకు ఆదేశించట్లేదు? హైకోర్టును రాయలసీమలో పెట్టాలని గతంలోనే డిమాండ్‌ చేశాం.  కానీ అప్పటి తెదేపా ప్రభుత్వం పట్టించుకోలేదు. జనసేనతో చర్చించి త్వరలో అమరావతిపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని జీవీఎల్‌ తెలిపారు.  



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.