భాజపాకు పెద్ద ‘రసగుల్లా’ దక్కుతుంది
close

తాజా వార్తలు

Published : 29/03/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపాకు పెద్ద ‘రసగుల్లా’ దక్కుతుంది

తొలి దశ ఎన్నికలపై అమిత్‌షాకు దీదీ కౌంటర్‌

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ తొలి విడత ఎన్నికలు జరిగిన 30 స్థానాల్లో 26 చోట్ల భాజపా విజయం సాధిస్తుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మిగతా నాలుగు స్థానాలను ఎవరికి వదిలేశారని ప్రశ్నించిన దీదీ.. ఈ ఎన్నికల్లో భాజపాకు పెద్ద ‘రసగుల్లా’(సున్నా) దక్కుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 

ఆదివారం దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బెంగాల్‌ తొలి విడత ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకు గానూ 26 చోట్ల మేం విజయం సాధిస్తామని నమ్మకంగా ఉంది. పార్టీ వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ విషయం చెప్పగలుతున్నా. రాష్ట్రంలో మొత్తం 200లకు పైగా సీట్లు గెలుచుకుంటాం’’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, షా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ.. ‘‘26 స్థానాల్లో గెలుస్తామని ఓ భాజపా నాయకుడు అన్నారు. మిగతా నాలుగు సీట్లను ఆయన ఎందుకు వదిలేశారు. ఆ స్థానాలకు కాంగ్రెస్‌, సీపీఎంలకు వదిలేశారా? ఈ ఎన్నికల్లో మీకు(భాజపా) పెద్ద రసగుల్లా (సున్నా)మాత్రమే దక్కుతుంది’’ అని ఎద్దేవా చేశారు. 

అంతేగాక, పోలింగ్ జరిగిన 24 గంటల్లోనే భాజపా గెలుపుపై ఎలా అంచనా వేయగలిగిందని ప్రశ్నించారు. ఈవీఎంలను హ్యాక్‌ చేసి చెబుతున్నారా? అని దుయ్యబట్టారు. ‘‘మీరు(అమిత్ షాను ఉద్దేశిస్తూ) దేశానికి హోంమంత్రి. అలాంటి మీరు అధికార దుర్వినియోగంపై సమాచారం ఇస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. ఎన్నికల ఆటలో భాజపా ఎప్పుడో ఓడిపోయింది. అందుకే, ఇలాంటి మాటలు చెబుతూ కేడర్‌ను వెనక్కితగ్గకుండా చూసుకుంటోంది’’ అని దీదీ వ్యాఖ్యానించారు. తొలి విడత ఎన్నికల్లో ఓటింగ్‌ 84శాతం దాటిందంటే ప్రజలు తృణమూల్‌ వెంట ఉన్నట్లు అర్థమని ఆమె అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని