బాలుడి కిడ్నాప్‌ కేసులో పురోగతి!
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలుడి కిడ్నాప్‌ కేసులో పురోగతి!

తిరుపతి: తిరుపతి అలిపిరి లింక్‌ బస్టాండ్‌లో గత నెల 27న అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఆరేళ్ల బాలుడు శివమ్‌ కుమార్‌ సాహూ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలుడిని కిడ్నాప్‌ చేసినట్టు భావిస్తున్న నిందితుడి కుటుంబాన్ని పోలీసులు గుర్తించారు. 

చిత్తూరు జిల్లా వి.కోట పరిసర గ్రామానికి చెందిన శివప్పను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈమేరకు రెండ్రోజుల క్రితమే కిడ్నాపర్‌ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్న వి.కోట పోలీసులు .. వారి నుంచి వివరాలు రాబట్టారు. శివప్ప ఎక్కడ ఉన్నాడో తెలియదని చెబుతున్న  కుటుంబ సభ్యులు.. నిందితుడికి ఉన్న ఇద్దరి కుమారుల్లో ఒకరు ఇటీవలే జ్వరంతో మరణించారని పోలీసులకు తెలిపారు. వి.కోటలో చిన్నపిల్లలను అపహరించి విక్రయించే ముఠా సైతం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఆ ముఠాకు చెందిన సభ్యుడా? లేక బాలుడిని పెంచుకోవడానికి కిడ్నాప్‌ చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వి.కోట పరిసర సరిహద్దుగా ఉన్న కర్ణాటక గ్రామాల్లో నిందితుడు తలదాచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని