close

తాజా వార్తలు

100కు ఫోన్‌చేస్తే ఇంటి దగ్గర దించుతారు

నాగ్‌పుర్‌:  ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు రాత్రి సమయంలో నిర్జన ప్రదేశంలో చిక్కుకుపోతే అలాంటివారిని సురక్షితంగా ఇంటి దగ్గర దించే కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ పోలీసులు ప్రారంభించారు. ‘దిశ’ ఘటన నేపథ్యంలో మహిళల్లో నమ్మకాన్ని పెంచేందుకే ఈ చర్య చేపట్టినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌కుమార్‌ ఉపాధ్యాయ తెలిపారు. నాగ్‌పుర్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఎవరైనా మహిళ 100కు ఫోన్‌ చేసి తాను వెళ్లాల్సిన ప్రాంతానికి సురక్షిత రవాణా సదుపాయం లేదని చెబితే చాలు.. పోలీసులు మహిళా కానిస్టేబుల్‌ను తోడుగా ఇచ్చి వాహనంలో గమ్యస్థానానికి చేర్చుతారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.