తేలికైందే మేలు
close

తాజా వార్తలు

Published : 13/03/2020 00:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తేలికైందే మేలు

సలహా

సాధారణంగా వాహనం కీ చైన్‌కి దానితోపాటు ఇతర తాళంచెవులు ఉంచడం చాలామందికి అలవాటు. ఇంటివి, ఆఫీసువి, బీరువాలవి.. ఎన్నెన్నో. ఇలా చేయడం వల్ల ఇగ్నిషన్‌ స్విచ్‌ ఫెయిల్యూర్‌ అయ్యే ప్రమాదం ఉందంటారు నిపుణులు. కారు ప్రయాణంలో ఉన్నప్పుడు ఇగ్నిషన్‌ నాబ్‌కి ఉన్న తాళంచెవి కుదుపులకు కిందికి, పైకి ఊగుతూ ఉంటుంది. దాంతోపాటు.. ఇతర కీస్‌, కీ చైన్‌ల భారం సైతం ఇగ్నిషన్‌ నాబ్‌పై పడుతుంది. దీంతో లోపల ఉండే టంబ్లర్స్‌ విరిగిపోతాయి లేదా పగుళ్లు ఏర్పడతాయంటారు. దీర్ఘకాలం ఇలాగే కొనసాగితే తర్వాత అది పని చేయకుండా మొరాయిస్తుంది. దీనికి పరిష్కారం తేలికైన కీ చైన్‌ వాడటం లేదా దానికి బండి కీ మాత్రమే ఉండేలా చూడటం.
కారు లాంటి కీ చైన్‌
వాహనం అంటే ప్రేమ ఉన్నవారు ఏ చిన్న మార్పుచేర్పులనైనా తమకు నచ్చినట్టుగా మలచుకుంటారు. ఇలాంటి వాళ్ల కోసం వాళ్లకు నచ్చేలా కీ చైన్‌ రూపొందించి ఇస్తోంది ఓ ఆన్‌లైన్‌ కంపెనీ. మీ కారు మోడల్‌ చెబితే చాలు.. అచ్చం ఆ మోడల్‌ని పోలి ఉన్న తాళం చెవిని తయారు చేసి ఇస్తారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, రాగి.. ఇలా నచ్చిన లోహంతో మీకోసమే చేసి ఇస్తారు. సొంతంగా వీటిని ఆర్డర్‌ ఇవ్వడమే కాదు.. సన్నిహితులకు దీన్ని బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని