close

తాజా వార్తలు

Published : 10/01/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మ నాకు నేర్పింది అదే: నాగచైతన్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఎన్నడూ.. సందిగ్ధావస్థలో ఉండకూడదంటున్నారు నాగచైతన్య. సమంత వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీ వేదికలో సామ్‌జామ్‌ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఆ షోకు అతిథిగా వచ్చిన నాగచైతన్యను సమంత.. ‘మీపై మహిళా ప్రభావం ఎంతమేరకు ఉంది’ అంటూ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా నాగచైతన్య స్పందిస్తూ ‘జీవితంలో ఎలా మెలగాలో అమ్మ నాకు స్పష్టంగా చెప్పింది. మనిషి ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌లా ఉండాలని, అటో, ఇటో ఏదో ఒక దారిని మాత్రమే ఎంచుకోవాలని సూచించింది. తేల్చుకోలేని స్థితిలో మాత్రం ఉండకూడదంది’ అంటూ బదులిచ్చారు.

అలాగే సమంత మాట్లాడుతూ.. నాగచైతన్యతో పెళ్లైన తర్వాత తాను సినిమాలు మానేస్తున్నానంటూ రూమర్లు వచ్చాయని పేర్కొంది . దీనికి చై స్పందిస్తూ ‘అసలు ఎందుకు సమాజంలోకి కొందరు వ్యక్తులు స్త్రీ, పురుషులు సమానం కాదని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. నా దృష్టిలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమే’ అంటూ మాట్లాడారు. దాంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగింది.

ప్రస్తుతం నాగచైతన్య, శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరి’అనే ఫీల్‌గుడ్‌ చిత్రలో నటిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరిదశలో ఉంది. మరి చై మహిళా ప్రాముఖ్యతను గురించి వివరించిన ఆ వీడియోను మీరు చూసేయండీ!

ఇవీ చదవండి!

విక్రమ్‌‘కోబ్రా’టీజర్‌ చూశారా!

థియేటర్లోకి ‘టక్‌ జగదీష్‌’ఎప్పుడంటే?




Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని