‘వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లే’
close

తాజా వార్తలు

Published : 12/04/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లే’

ఉప ఎన్నిక ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు

రాపూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో ఓటడిగే అర్హత వైకాపాకు లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. డబ్బు తీసుకుని ఓట్లేస్తే హక్కులు కోల్పోతారని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరిలో నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడారు. 

బెదిరించే వాలంటీర్లను ఎదిరించాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా గెలిస్తే అక్రమాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లేనని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలంతా రాజీనామా చేయాలని.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారన్నారు. అప్పుడు దిల్లీ వెళ్లి పోరాటం చేయొచ్చన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా గతంలో తాముచేసిన అభివృద్ధే కనిపిస్తోందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు వైకాపా ప్రభుత్వం స్వస్తి పలికిందని.. కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. తెదేపా, వైకాపా పాలనపై చర్చకు ధైర్యముందా? అని చంద్రబాబు సవాల్‌ విసిరారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని