close

తాజా వార్తలు

Updated : 25/11/2020 11:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బండి సంజయ్‌ వ్యాఖ్యలను ఖండించిన షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌: గ్రేటర్‌లో భాజపా గెలుస్తే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. శత్రుస్థావరాలపై నిర్వహించాల్సిన సర్జికల్‌ స్ట్రైక్‌ సొంత దేశంలో నిర్వహిస్తాననడం సరికాదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ విమర్శించారు. ఎంపీగా బాధ్యతాయుత పదవిలో ఉన్న బండి సంజయ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌ కానీ, పోలీసులు కానీ చర్య తీసుకోవాలిన షబ్బీర్‌ అలీ డిమాండ్‌ చేశారు. 
 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన