
తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 197 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో కొత్తగా 197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,93,253కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,589కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 376 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,88,275కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,389 ఉండగా వీరిలో 1842 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి..
ఆదుకుంటున్న మునుపటి కరోనా ఇన్ఫెక్షన్లు
Tags :