కేంద్రమంత్రిపై ఎందుకు కేసు పెట్టలేదు?: సీపీఐ
close

తాజా వార్తలు

Published : 02/07/2020 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేంద్రమంత్రిపై ఎందుకు కేసు పెట్టలేదు?: సీపీఐ

గుంటూరు: సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటే.. కేంద్ర మంత్రి మాటలకు పరువు పోదా? అని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌  కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నిర్మలా సీతారామన్‌ ఇటీవల రెండు అవాస్తవాలు మాట్లాడారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి ఓ మాట, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఓ మాట చెప్పారు. కేంద్ర మంత్రి మాటలకు మీ పరువు పోదా?. అమె మాటలు అబద్ధమైతే ఎందుకు కేసు పెట్టడం లేదు’’ అని రామకృష్ణ నిలదీశారు.
కేంద్రంలో భాజపా నేతలు తప్పు చెబుతున్నారని అంటే.. కమ్యూనిస్టు నాయకులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కేవలం నలుగురు నాయకులే రాష్ట్రాన్ని పాలిస్తూ.. పెత్తందారీ పోకడలను అనుసరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రులకు కనీసం సీఎం వద్ద ఇంటర్వ్యూ కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని