ఆ 8 రాష్ట్రాల నుంచే అత్యధిక కరోనా మరణాలు!
close

తాజా వార్తలు

Published : 30/11/2020 14:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 8 రాష్ట్రాల నుంచే అత్యధిక కరోనా మరణాలు!

దిల్లీ: దేశంలో నమోదవుతున్న కొవిడ్‌ మరణాల్లో ఎక్కువ శాతం ఎనిమిది రాష్ట్రాల నుంచే ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఆదివారం కొత్తగా 443 మంది మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,37,173కి చేరింది. వీటిలో 71 శాతం మరణాలు దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, పంజాబ్‌, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

ఆదివారం సంభవించిన 443 మరణాల్లో 89 ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీలో 68, పశ్చిమ బెంగాల్‌లో 54 మరణాలు సంభవించాయి. ఇక 22 రాష్ట్రాల్లో మరణాల రేటు జాతీయ సగటు మరణాల రేటు కంటే తక్కువగా ఉండడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ఆగస్టులో 1.98శాతంగా ఉన్న మరణాల రేటు గత మూడు నెలలుగా క్రమంగా తగ్గుతూ 1.45 శాతానికి చేరింది. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది లక్షల జనాభాకు నమోదవుతున్న మరణాల్లో భారత్‌ చాలా మెరుగైన స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌ చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల వల్లే మరణాలను కట్టడి చేయగలిగామని వివరించింది. రోజువారీ మృతుల సంఖ్య 500 దిగువనే ఉంటోందని తెలిపింది. అలాగే నిర్ధారణ పరీక్షలను సైతం పెంచినట్లు వెల్లడించింది. గత మూడు నెలలుగా సగటున రోజుకి పది లక్షల పరీక్షలు చేస్తున్నట్లు తెలిపింది.

రాష్ట్రం                మొత్తం కేసులు         మరణాలు

మహారాష్ట్ర              18,20,059            47,071
దిల్లీ                    5,66,648             9,066
పశ్చిమ బెంగాల్‌         4,80,813             8,376
హరియాణా             2,32,522             2,401
పంజాబ్‌                1,51,538             4,780
కేరళ                    5,99,600            2,223
ఉత్తర్‌ప్రదేశ్‌              5,41,873             7,742
రాజస్థాన్‌                2,65,386             2,292


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని