Coronaపై పోరులో ఎంబీబీఎస్‌ విద్యార్థులు!
close

తాజా వార్తలు

Published : 03/05/2021 01:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Coronaపై పోరులో ఎంబీబీఎస్‌ విద్యార్థులు!

కేంద్రం రేపు ప్రకటించే అవకాశం

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తున్న వేళ దాన్ని అరికట్టేందుకు ఎంబీబీఎస్‌ విద్యార్థులను రంగంలోకి దింపేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ కట్టడికి తీసుకునే చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌, హెల్త్‌ సెక్రెటరీతోపాటు ఉన్నతాధికారులతో ఆదివారం ప్రధాని మోదీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. కొవిడ్‌ను అరికట్టేందుకు మానవ వనరులను పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతోపాటు ఎంబీబీఎస్‌, నర్సింగ్‌లో ఉత్తీర్ణులైనవారిని మహమ్మారిపై పోరులో భాగం చేయాలని నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొవిడ్ విధులు నిర్వర్తించనున్న వైద్య విద్యార్థులకు ప్రభుత్వ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

కరోనా రెండో దశ ఆసుపత్రులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అనేక ఆసుపత్రుల్లో పడకలు లభించడం లేదు. పలు దవాఖానాల్లో ఆక్సిజన్‌ సకాలంలో అందక బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని చోట్ల వైద్య పరికరాల కొరత ఏర్పడుతోంది. ఈ పరిస్థితులు వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదన వెల్లగక్కుకుంటూ కరోనా బారిన పడొద్దని, ఇంట్లోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఆసుపత్రుల్లో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఒత్తిడి అధికమై ఇటీవల దిల్లీకి చెందిన ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని