Tirumala: దుకాణాల వద్ద అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tirumala: దుకాణాల వద్ద అగ్నిప్రమాదం

ఓ దుకాణదారుడు సజీవదహనం

తిరుపతి: తిరుమలలో దుకాణాల వద్ద ఈ ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. శ్రీవారి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 దుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. మంటల ధాటికి దుకాణాల్లోని వస్తువులు కాలిపోయాయి. ఈ క్రమంలో దుకాణాల్లోని శకలాలను తొలగిస్తుండగా ఓ వ్యక్తి మృతదేహం బయటపడింది. అగ్నిప్రమాదంలో దుకాణదారుడు సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. ఆస్థాన మండపంలోని షాపు నెం.84లో ఈ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ సిబ్బంది అంచనా వేస్తున్నారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని