ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల ఆచూకీ లభ్యం
close

తాజా వార్తలు

Updated : 06/01/2021 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీప బంధువు, బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరి సోదరుల ఆచూకీ తెలిసింది. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు. వారు సురక్షితంగా ఉన్నట్లు ప్రవీణ్‌రావు మరో సోదరుడు ప్రతాప్‌రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రావు పోలీసులు, మీడియాకి ధన్యవాదాలు చెప్పారు. కిడ్నాప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు.  

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. ప్రవీణ్‌రావు ఇంటి చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రవీణ్‌రావు కిడ్నాపైన విషయం తెలియడంతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే అర్ధరాత్రి దుండగులు ఉపయోగించిన రెండు కార్లను పోలీసులు గుర్తించారు. 

కిడ్నాప్‌ ఎవరు చేశారో తెలుసు: ప్రతాప్‌రావు
బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, అతని ఇద్దరి సోదరుల కిడ్నాప్‌కు సంబంధించి ప్రవీణ్‌కుమార్‌రావు సోదరుడు ప్రతాప్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మా వాళ్లను ఎవరు కిడ్నాప్‌ చేశారో మాకు తెలుసు. ఒక భూమి విషయంలో మాకు సంబంధం లేకున్నా మమ్మల్ని లాగారు. వాళ్లు చట్టపరంగా వెళ్లకుండా దౌర్జన్యానికి దిగారు. మా తగాదాలను దయచేసి రాజకీయం చేయొద్దు. భూ వివాదం ఘటనకు సీఎం కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. రాత్రి మా ఇంటికి వచ్చిన దుండగులు లాప్‌టాప్‌, ఫోన్లు లాక్కెల్లారు. మా వాళ్లను ఓ ఫామ్‌ హౌస్‌కు బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసులు సకాలంలో స్పందించి మా కుటుంబీకులను రక్షించారు. కొన్ని దస్ర్తాలపై సంతకం పెట్టించుకున్నారు. మాకు అనుమానం ఉన్న వాళ్ల పేర్లు పోలీసులకు చెప్పాం’ అని ప్రతాప్‌రావు వివరించారు. 

ఇవీ చదవండి..
ప్రవీణ్‌రావు కిడ్నాప్‌
కుటుంబంపై పెట్రోల్‌తో దాడి



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని