close

తాజా వార్తలు

Published : 19/09/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇష్టంగా తిననివ్వండి...!

పిల్లలకు తినిపించడమే తమకు పెద్ద సమస్య అనే తల్లులు చాలామందినే మనం చూసుంటాం. వారంతట వారుగా తినడం, అడిగి మరీ ఆకలి తీర్చుకోవడం వంటివి పిల్లలు ఎందుకు చేయలేకపోతున్నారు. వారు చక్కగా తినాలంటే ఏం చేయాలి? చూద్దామా!

చాలామంది తల్లులు పిల్లల కడుపు నింపాలనే ఉద్దేశంతో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే కుక్కి పెడుతుంటారు. దీనివల్ల పిల్లలు తినడం అంటేనే... అయిష్టత పెంచుకుంటారు. అలాకాకుండా ముందు వారికి ఏం ఇష్టమో తెలుసుకోవాలి. అవి రుచి చూపిస్తూనే, మరో పదార్థాన్నీ దానికి కలగలిపి వండాలి. అలా క్రమంగా అన్ని రకాల వంటకాల్నీ ఇష్టపడేలా చేయాలి.

* చిన్నారికి అన్ని పోషకాలు అందేలా చూడటంలో తల్లిగా మీదే కీలకపాత్ర. పిల్లలు ఎప్పుడూ ఒకే తరహా రుచుల్ని ఇష్టపడకపోవచ్ఛు బయటదొరికే జంక్‌ఫుడ్‌కి ప్రత్యామ్నాయం చూపించాలి. ఆ రుచుల్లో కాయగూరలూ, ఆకుకూరల వంటివాటితో ప్రయత్నించండి. అలానే వండేది ఏదైనా సరే చక్కటి రుచితో పాటు కంటికింపుగానూ ఉండేలా చూసుకోవాలి. సువాసన... తినాలనే ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే వాటిపై మిరియాలపొడి, మసాలాలు, కొత్తిమీర వంటివి చల్లండి. ఇవన్నీ వారి దృష్టిని ఆకర్షించేందుకు సాయపడతాయి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని