
తాజా వార్తలు
కష్టకాలంలో.. ధీమాగా ఉందాం!
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్-19.. మన జీవన శైలిని మార్చేసింది. శారీరకంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. ఆర్థికారోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అంతే ప్రధానం. ఆదాయాలు తగ్గడంతో ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతోంది. ఇదీ ఇప్పుడు మంచిది కాదు. అనుకోకుండా వచ్చే ఆపదలను దృష్టిలో పెట్టుకొని, ఆర్థికంగా ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాల్సిందే. అనుకోని సందర్భాల్లో కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా.. తీవ్ర వ్యాధుల బారినపడినప్పుడూ ఆర్థిక భారం పడకుండా చూసే పాలసీల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది.
జీవన శైలిలో మార్పులు చోటు చేసుకోవడంతో కొత్త కొత్త వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. కేన్సర్, గుండె జబ్బుల్లాంటివి కుటుంబ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తున్నాయి. ఇక వీటన్నింటికీ మించి ప్రస్తుత మహమ్మారి అటు వ్యాపారాలు, ఉద్యోగులతోపాటు, లక్షల కుటుంబాల్లో ఆర్థిక అత్యవసర పరిస్థితిని తీసుకొచ్చింది. ఒకవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులూ భయపెడుతున్నాయి. అందుకే, కష్టకాలం ఎదురైనప్పటికీ చెక్కుచెదరని ఆర్థిక పరిస్థితులను మనం సృష్టించుకోవాలి.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాయామం, సమతుల ఆహారంలాంటివి ఎంతో ముఖ్యం. అదే విధంగా ఆర్థికారోగ్యం కోసం సరైన పథకాలను ఎంచుకోవడం, వాటిని ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించుకోవడం అవసరం. భవిష్యత్ ఆర్థిక అవసరాలను ఇప్పుడే అంచనా వేయగలగాలి. అనుకోనిదేమైనా జరిగితే మన బాధ్యతలను చూసుకునేందుకు ఏర్పాట్లు చేయాలి. దీనికి పూర్తిస్థాయిలో బీమా పాలసీలే ఉపకరిస్తాయి.
ఒకప్పటితో పోలిస్తే కరోనా తర్వాత బీమా పాలసీల అవసరం బాగా పెరిగిందనే చెప్పొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కుటుంబానికి తగిన భరోసా కల్పించేలా బీమా తీసుకోవడం తప్పనిసరి. ఇలా పాలసీ తీసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
* అనుబంధ పాలసీగా: జీవిత బీమా పాలసీ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా రెండు అంశాలకు పరిహారం ఇచ్చేలా చూసుకోవాలి. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడే పరిహారం ఇవ్వడం అనే విధంగా కాకుండా.. తీవ్ర వ్యాధుల బారినపడినప్పుడూ పాలసీ ఆదుకోవాలి. దీనికోసం మీరు తీసుకునే పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనుబంధంగా ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీని అవసరమే ఎక్కువగా ఉంది. మారుతున్న జీవిత దశలను బట్టి, పాలసీని సమీక్షించుకోవాలి.
* ఒకేసారి చెల్లించేలా: పాలసీదారుడికి ఏదైనా తీవ్ర వ్యాధి సోకిందని గుర్తించిన వెంటనే.. హామీ ఇచ్చిన పరిహారాన్ని ఒకే విడతగా చెల్లించేలా పాలసీని ఎంచుకోండి. దీనివల్ల ఆ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును చేతి నుంచి పెట్టుకోవాల్సిన అవసరం రాదు. కుటుంబంపైనా ఆర్థిక భారం ఉండదు.
* ప్రీమియం రద్దయ్యేలా: జీవిత బీమా పాలసీతోపాటు.. ప్రీమియం వైవర్ రైడర్‌ను ఎంచుకోవడం మర్చిపోవద్దు. అనుకోకుండా ప్రమాదంలో వైకల్యం సంభవించినా, తీవ్ర వ్యాధుల బారిన పడినా.. జీవిత బీమా ప్రీమియాలను చెల్లించలేని పరిస్థితి రావచ్చు. ఇలాంటప్పుడు ఆ జీవిత బీమా పాలసీ ప్రీమియాలు రద్దయ్యేలా ఈ ప్రీమియం వైవర్ తోడ్పడుతుంది. కష్టకాలంలో బీమా కొనసాగేందుకు ఇది ఉపకరిస్తుంది.
* వయసును బట్టి..: పెరుగుతున్న వయసు ఆధారంగా జీవిత బీమా మొత్తం, క్రిటికల్ ఇన్సూరెన్స్ సమతౌల్యం చేసుకునే ఆటో రీబ్యాలెన్సింగ్ సౌకర్యం మీ పాలసీలో ఉండేలా చూసుకోండి. ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఇది పని జీవిత బీమా, క్రిటికల్ ఇల్నెస్ మొత్తాలను సర్దుబాటు చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్ర వ్యాధుల బారినపడే అవకాశాలు పెరుగుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది పనిచేస్తుంది. బీమా పాలసీలు తీసుకునేటప్పుడు మీరు ఎంచుకున్న పాలసీలో ఇలాంటి వెసులుబాటు ఉందా లేదా తెలుసుకున్నాకే పాలసీని తీసుకోండి. జీవిత బీమా పాలసీలోనే ఇవన్నీ ఉండేలా చూసుకున్నప్పుడు ఒకే పాలసీతో సంపూర్ణ రక్షణ లభిస్తుంది. పాలసీ నిర్వహణా సులువవుతుంది.
కరోనా టర్మ్ రైడర్
రోజురోజుకూ విజృంభిస్తున్న కొవిడ్-19తో మరణం సంభవించినప్పుడు పరిహారం అందేలా ఒక కొత్త టర్మ్ రైడర్‌ను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది. ఏడాది వ్యవధి ఉన్న ఈ ‘కొవిడ్-19 టర్మ్ రైడర్’ పాలసీని మ్యాక్స్ లైఫ్ ఇప్పటికే అందిస్తోన్న టర్మ్, సేవింగ్స్, ఇన్‌కం, రిటైర్మెంట్ పాలసీలకు అనుబంధంగా తీసుకోవచ్చు. కనీస పాలసీ మొత్తం రూ.లక్ష. దీనికి ప్రీమియం రూ.271. గరిష్ఠంగా రూ.10లక్షల వరకూ పాలసీని ఎంచుకోవచ్చు. దీనికి రూ.2,710 ప్రీమియం చెల్లించాలి. ఈ రైడర్‌ను తీసుకున్న పాలసీదారులకు ఒకవేళ కరోనా సోకితే.. వెంటనే పాలసీ విలువలో 20శాతం చెల్లిస్తారు. దురదృష్టవశాత్తూ మరణం సంభవిస్తే.. 100 శాతం పాలసీ విలువను నామినీకి చెల్లిస్తారు. 18-65 ఏళ్ల వయసున్న వారు దీన్ని తీసుకునేందుకు అర్హులు.
- ఎం.ఆనంద్, ప్రెసిడెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
