close

తాజా వార్తలు

Updated : 13/01/2020 15:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరంగల్‌లో దుమ్మురేపారు!

ముగిసిన ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 ప్రాంతీయ పోటీలు

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఈనాడు, స్ప్రైట్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్‌ లీగ్‌-2019 ప్రాంతీయ పోటీలు వరంగల్‌ కేంద్రంగా ఘనంగా ముగిశాయి. శుక్రవారం వరంగల్‌ ఎల్బీ కాలేజీ మైదానంలో క్రీడాకారులు గెలుపే లక్ష్యంగా దుమ్మురేపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన జిల్లాస్థాయి విజేతలు హాజరయ్యారు. ఎల్బీ కాలేజీలో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, చదరంగం, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో మహిళా క్రికెట్‌ ఫైనల్స్, కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బ్యాడ్మింటన్‌ పోటీలు సాగాయి. ఈనాడు వరంగల్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి కేఎస్‌పీ రాజు అధ్యక్షతన జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆర్జేడీ లింగయ్య హాజరై విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో గణపతి ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, ఏకశిల విద్యా సంస్థల ఛైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి, వరంగల్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి శ్రీనివాస్, ఖోఖో సంఘం కార్యదర్శి శ్యాంప్రసాద్, కబడ్డీ సంఘం కన్వీనర్‌ ప్రభాకర్, వాలీబాల్‌ సంఘం ప్రతినిధి సాంబయ్య, ఆర్బిటర్‌ కన్నా, పీఈటీలు, కోచ్‌లు బండారి ప్రభాకర్, కుమార్, అభినవ్‌ పాల్గొన్నారు. మహిళా క్రీడాకారులకు వసతిని ఏకశిల విద్యాసంస్థలు, పురుష క్రీడాకారులకు వాగ్దేవి విద్యాసంస్థలు బస, రవాణా వసతి కల్పించాయి. గార్డియన్, రోహిణి ఆసుపత్రులు వైద్య సేవలందించాయి.

మహిళల క్రికెట్‌ విజేత వరంగల్‌ క్రికెట్‌ సంఘం జట్టు: ఫైనల్స్‌లో తలపడిన టీఎస్‌ఆర్‌డబ్ల్యూఐఈఎస్‌ వనపర్తి, మహబూబ్‌నగర్‌ జట్టుపై వరంగల్‌ క్రికెట్‌ సంఘం జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వరంగల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. జట్టులో విశ్వనాథ్‌ చైతన్య 36, అశ్విని 11 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన వనపర్తి జట్టు 14.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టానికి 53 పరుగులే చేసింది. వరంగల్‌ జట్టు బౌలర్లు దివ్య 3, అశ్విని 2 వికెట్లు తీశారు. 

కబడ్డీ విజేతలు

 హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో ట్రినిటీ జూనియర్‌ కాలేజీ, కరీంనగర్‌ బాలికల జట్టుపై టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌  జూనియర్‌ కాలేజీ, పెద్దమ్మగడ్డ, వరంగల్‌ జట్టు పోరాడి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో తలపడ్డ శ్రీఆర్యభట్ట జూనియర్‌ కాలేజీ, నిజామాబాద్‌ జట్టుపై శ్రీబాలాజీ జూనియర్‌ కాలేజీ వరంగల్‌ జట్టు విజయకేతనం ఎగురవేసింది.

 ఖోఖోలో..

ఉత్కంఠభరితంగా జరిగిన ఖోఖో బాలికల విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ పాలకుర్తి(వరంగల్‌) జట్టుపై టీఎస్‌ మోడల్‌ స్కూల్, నూకపల్లి, కరీంనగర్‌ జట్టు ఘనవిజయం సాధించింది. బాలురలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మడికొండ వరంగల్‌ జట్టుపై జీజేసీ డిచ్‌పల్లి, నిజామాబాద్‌ జట్టు విజయదుందుభి మోగించింది.

వాలీబాల్‌లో..

ఆసక్తిగా సాగిన బాలికల వాలీబాల్‌ పోరులో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ జూనియర్‌ కాలేజీ చింతకుంట, కరీనంగర్‌ జట్టుపై టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ జూనియర్‌ కాలేజీ, పెద్దమ్మగడ్డ, వరంగల్‌ జట్టు గెలుపొందింది. బాలుర విభాగంలో జీజేసీ కొత్తగూడ వరంగల్‌ జట్టుపై ఎస్‌బీఎస్‌ జీజేసీ సత్తుపల్లి, ఖమ్మం విజయఢంకా మోగించింది. 

చదరంగంలో..

చదంరంగంలో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ క్రీడాకారులు తలపడ్డారు. బాలికల విభాగంలో అల్ఫోర్స్‌ జూనియర్‌ కాలేజీ, కరీంనగర్‌కు చెందిన ఐఎన్‌.సిరిమేఘన ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.శ్రీలహరి, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, ఖమ్మం రెండోస్థానంతో సరిపెట్టుకుంది. బాలుర విభాగంలో శ్రీసాయి జూనియర్‌ కాలేజీ, నిజామాబాద్‌కు చెందిన బి.శివసాయి తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. వాగేశ్వరి ఇంజనీరింగ్‌ కాలేజీ, కరీనంగర్‌కు చెందిన క్రీడాకారుడు కె.తరుణ్, రెండో స్థానంలో నిలిచాడు. 

బ్యాడ్మింటన్‌లో..

బ్యాడ్మింటన్‌ పోటీల్లో క్రీడాకారులు విజయం కోసం చెమటోడ్చారు. బాలికల సింగిల్స్‌ విభాగంలో వి.తనుశ్రీ (ఓరుగల్లు జూనియర్‌ కాలేజీ, వరంగల్‌)  తొలిస్థానంలో నిలిచింది. పి.నిఖిత (న్యూ విజన్‌ జూనియర్‌ కాలేజీ, ఖమ్మం) ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర సింగిల్స్‌ విభాగంలో కె. ప్రశాంత్, శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, ఖమ్మం ప్రథమ స్థానంలో నిలిచాడు. జి.మణిదీప్‌ (ఎస్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ, వరంగల్‌) ద్వితీయ స్థానంలో  నిలిచాడు. డబుల్స్‌ బాలుర విభాగంలో జి.సహృదయ్, ఎన్‌.అనిరుధ్‌ (శ్రీబాలాజీ జూనియర్‌ కాలేజీ, వరంగల్‌) ప్రథమస్థానంలో నిలవగా, కె.ప్రశాంత్, కె.చేతన్‌ (శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ, ఖమ్మం) ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.