close

తాజా వార్తలు

Published : 04/02/2020 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా బారిన గర్భిణి.. బిడ్డ సురక్షితం!

బీజింగ్‌: చైనాలోని హార్బిన్‌లో కరోనా వైరస్‌ బారిన పడిన ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండటం గమనార్హం. మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని హీలియోంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని హార్బిన్‌కు చెందిన ఓ గర్భిణి ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడింది. పురిటి నొప్పులతో జనవరి 30న ఆమె ఆస్పత్రిలో చేరింది. అయితే బిడ్డకు కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందేమో అందరూ అనుమానించారు. కానీ ఆ బిడ్డ ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ బిడ్డకు వైద్యులు రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గానే తేలినట్లు తెలిపారు.  ప్రస్తుతం తల్లి, బిడ్డల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.