close
Array ( ) 1

తాజా వార్తలు

అన్నీ ఉన్న.. అనాథ

నెలకు రూ.27వేల పింఛను వస్తున్నా..

నెల రోజులుగా ద్వారకా బస్‌స్టేషన్‌లోనే..

సపర్యలు చేస్తున్న స్టేషన్‌ మేనేజర్‌ నారాయణ

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శివ కామేశ్వరరావు

విశాఖపట్నం: ఆయన విశాఖ పోర్టులో ఉద్యోగ విరమణ చేశారు. నెలకు రూ.27వేల పింఛను వస్తోంది. ఇద్దరు కుమార్తెలను ప్రయోజకులను చేసి.. ఒకరిని అమెరికా, మరొకరిని హైదరాబాద్‌లో అల్లుళ్ల వద్దకు పంపించారు. నెల రోజులుగా నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో అనాథగా మిగిలిపోయారు శివకామేశ్వరరావు. మొదటి రోజు ఆర్టీసీ అధికారులు వెళ్లిపోవాలని చెప్పినా.. అక్కడే ఉండడంతో బస్‌స్టాండు మేనేజర్‌గా పనిచేస్తున్న ఏఎన్‌ఎస్‌ నారాయణ తన ఇంటికి తీసుకెళ్లి సపర్యలు చేస్తున్నారు. కాస్త మతిస్థితిమితం తప్పి ఉన్న ఆయన నుంచి వివరాలు సేకరించి కలెక్టరేట్‌ ‘స్పందన’ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడి అధికారుల సూచన మేరకు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తమ్ముడున్నా ఆదుకోలేదు....! శివ కామేశ్వరరావు గోపాలపట్నంలోని ప్రస్తుత ఇంటి చిరునామా చెప్పలేకపోతున్నా, గతంలో నివసించిన ఆయన సొంతిల్లు చెంగలరావుపేటలో ఉంది. బస్‌స్టేషన్‌ మేనేజర్‌ నారాయణ, పోలీసులు అక్కడకు వెళ్లగా అతని తమ్ముడు చంద్రమౌళి ఉన్నారు. శివ కామేశ్వరరావు వాటా తనకు విక్రయించేశారని, అన్నతో తనకెలాంటి సంబంధం లేదని తీసుకెళ్లిపోవాలనడంతో అధికారులు నిశ్చేష్ఠులయ్యారు. పోలీసులు గట్టిగా చెప్పడంతో ఒక రోజు ఇంటి దగ్గరుంచి, మర్నాడు తిరిగి బస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విడిచిపెట్టేశాడాయన. కామేశ్వరరావుకు నలుగురు తమ్ముళ్లున్నా వారంతా బాగానే స్థిరపడ్డారు.

పోలీసుల వద్ద ఛాయాచిత్రం...! నెల రోజుల క్రితం శివ కామేశ్వరరావును ఓ మహిళ తీసుకువచ్చి సుమారు 3 గంటలు పదో నెంబరు ఫ్లాట్‌ఫాం వద్ద ఉండగా ద్వారకా బస్‌స్టేషన్‌ పోలీసులు వారిద్దరి ఛాయాచిత్రాన్ని తీశారు. ఆ తర్వాత ఆయనను విడిచిపెట్టి ఆమె వెళ్లిపోయింది.

● బ్యాంకు ఖాతా వివరాలపై ఆరా.. ఈయన వివరాలు నిర్ధారించుకునేందుకు పోర్టు కార్యాలయానికి వెళ్లగా, ప్రతి నెలా రూ.27వేల పింఛను ఆయనకు వస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత బ్యాంకుకు వెళ్లి, ముందు జాగ్రత్త చర్యగా పాత అకౌంట్‌ను నిలిపివేసి, కొత్తగా మరో ఖాతా తెరిపించారు. సొంతిల్లు ఉన్న చెంగల్రావుపేటకు తనను తీసుకెళ్లాలని ఆయన అధికారులను ప్రాధేయపడడం చూపరులను కలచివేస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.