close
Array ( ) 1

తాజా వార్తలు

నీటిలో ఆ తేడాలెందుకు?

ప్రశ్న: నీటిని వేడి చేయడానికి బకెట్లో ఇమ్మర్షన్‌ హీటర్‌ పెట్టినప్పుడు పైన ఉన్న నీరు కింద ఉన్న నీటి కన్నా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకు? - ప్రవీణ్‌, సూర్యాపేట

కెట్లో హీటర్‌ పెట్టిన కొన్ని నిమిషాల్లో ఇలా పైన, కింద ఉన్న నీళ్లలో తేడా గమనిస్తుంటాం.

* హీటర్‌కు తాకుతూ కిందుగా ఉన్న నీరు ముందు వేడెక్కుతుంది. చుట్టుపక్కల ఉన్న నీరు చల్లగానే ఉంటుంది. వేడి నీటి సాంద్రత (డెన్సిటీ) చల్లని నీటి సాంద్రత కన్నా తక్కువ.

* ప్లవన సూత్రాల (లాస్‌ ఆఫ్‌ ఫ్లొటేషన్‌) ప్రకారం సాంద్రత తక్కువ ఉన్నవి తేలుతాయి. సాంద్రత ఎక్కువ ఉన్నవి మునుగుతాయి. హీటర్‌ ద్వారా వేడెక్కిన నీటి సాంద్రత తక్కువ కాబట్టి ఆ నీరు మెల్లమెల్లగా బకెట్‌ పై భాగానికి చేరుకుంటుంది. ఇంకా అంతవరకు వేడెక్కని చల్లని నీరు సాంద్రత ఎక్కువ కాబట్టి కిందే ఉంటుంది.

* అందుకే హీటర్‌తో బకెట్‌లో నీటిని వేడి చేసినప్పుడు పైన వేడిగా, కింద చల్లగా ఉంటుంది.

* మొత్తం వేడెక్కిన తర్వాత బకెట్లో నీళ్లన్నీ మరుగుతాయి. అప్పుడు పైనా కిందా తేడా ఉండదు.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి,
జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.